Germany: పారిశ్రామిక రంగంలో చైనాకు షాక్… సరికొత్త ప్లాన్‌తో జర్మనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Germany: పారిశ్రామిక రంగంలో చైనాకు పెద్ద షాక్ తగలనుంది. చైనాకు షాకిచ్చేందుకు ఐరోపాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ సిద్ధమైంది. కీలక రంగాల్లో ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు జర్మనీ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఈ మేరకు ‘స్ట్రాటజీ ఆన్ చైనా’ పేరిట 40 పేజీల వ్యూహపత్రాన్ని గురువారం విడుదల చేసింది. దీనిలో బీజింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు బెర్లిన్ అనుసరించాల్సిన కఠిన నిబంధనలను వెల్లడించింది.
Read also: Neha Malik Pics: పింక్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న నేహా మాలిక్.. హాట్ పిక్స్ వైరల్!
Also Read
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
‘‘చైనా మారిపోయింది. ఆ దేశ రాజకీయ నిర్ణయాలు, మార్పుల కారణంగా మేము కూడా చైనా విషయంలో అనుసరించే వైఖరిని మార్చుకోవాల్సి ఉంది’’ అని ఆ వ్యూహపత్రంలో జర్మనీ పేర్కొంది. తన స్వప్రయోజనాలను కాపాడుకోవడానికి చైనా తీవ్రంగా పనిచేస్తోందని.. ఇందు కోసం అంతర్జాతీయ నిబంధనలు కూడా మార్చేందుకు ప్రయత్నించడం ప్రపంచ భద్రతకు ఇబ్బందికరంగా మారిందని ఆ పత్రంలో పేర్కొంది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ నేతృత్వంలోని మూడు పార్టీల కూటమి ప్రభుత్వం కొన్ని రోజులపాటు మల్లగుల్లాలు పడి చివరికి దీనికి ఆమోద ముద్రవేసింది. చైనాలో వ్యాపారం, పెట్టబడులను కొనసాగిస్తూనే.. ఆ దేశంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ప్రధానంగా ఔషధాలు, విద్యుత్తు కార్లలో వాడే లిథియం బ్యాటరీలు, చిప్స్ తయారీ ముడిసరుకుల విషయంలో దీనిని అమలు చేయనుంది. ఈ వ్యూహ పత్రంపై దేశ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ట్వీట్‌చేశారు. తాము చైనా నుంచి విడిపోవాలనుకోవడంలేదని.. కానీ, కీలక విషయాల్లో ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనుకొంటున్నామని దేశ ఛాన్సలర్ ట్వీట్ లో పేర్కొన్నారు. చైనాలో మానవహక్కుల ఉల్లంఘనలు పెరిగాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. బెర్లిన్‌కు బీజింగ్ అత్యంత కీలకమైన వ్యాపార భాగస్వామి అన్న విషయం తెలిసిందే. 2022లో ఇరుదేశాల మధ్య 300 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!