AR Rahman- Kamala Harris: నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు సపోర్టుగా ‘ద ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐ లాండర్స్ (ఏఏపీఐ)’ నిధుల సేకరణ టీమ్ ఓ సభను ఏర్పాటు చేయబోతుంది. ఆ సభలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియోను ఏఆర్ రెహమాన్ రూపొందించారని ఏఏపీఐ విక్టరీ ఫండ్ ఛైర్‌పర్సన్ శేఖర్ నరసింహన్ తెలిపారు. ఈ ప్రదర్శనతో అమెరికాలో పురోగతి, ప్రాతినిధ్యానికి నిలబడిన నాయకులు, కళాకారుల బృందానికి ఏఆర్ రెహమాన్ గాత్రాన్ని అందించనున్నారు. ఇది కేవలం సంగీత కార్యక్రమం మాత్రమే కాదు.. ఇది మా సంఘాలు, మేము అమెరికాలో చూడాలనుకునే భవిష్యత్తుకు ఓటు వేయాలనే కార్యాచరణకు పిలుపు నిచ్చారని నరసింహన్ చెప్పుకొచ్చారు.
Read Also: Zee : జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024.. నేటి సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగులో..!
కాగా, 30 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో కమలా హారిస్‌కు మద్దతుగా ఉన్న పలువురు నేతల వాయిస్‌లను ఏఆర్ రెహమాన్ పొందుపరిచినట్లు ద ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐ లాండర్స్ విక్టరీ ఫండ్ ఛైర్‌పర్సన్ నరసింహన్ చెప్పుకొచ్చారు. అలాగే, ఇందులో ఏఆర్ రెహమాన్‌తో పాటు ఇండియాస్పోరా వ్యవస్థాపకులు రంగస్వామి సైతం కనిపించనున్నారని పేర్కొన్నారు. ఈ వీడియో విక్టరీ ఫండ్ అనే యూట్యూబ్‌లో అక్టోబరు 13వ తేదీన రాత్రి 8 గంటల నుంచి అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చారు.