Zee : జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024.. నేటి సాయంత్రం 6 గంటలకు.. జీ తెలుగులో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zee : నిరంతరం ప్రేక్షకులకు వినోదం అందిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న ఛానల్ జీ తెలుగు. ఎదురులేని ప్రయాణంలో ఛానల్ఉన్నతికి తమవంతు కృషి చేస్తున్న ప్రతిభావంతులైన నటీనటులు, కళాకారులు, దర్శకులు, రచయితలు, నిర్మాతలు.. అందరినీ గౌరవిస్తూ అందించే సత్కారమే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్. ప్రతిష్ఠాత్మక జీ తెలుగు కుటుంబ అవార్డులను అందుకుని మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని నటీనటులను ప్రోత్సహిస్తుంది. ప్రతి ఏటా ఘనంగా జరిగే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేడుక ఈ సంవత్సరం మరింత వైభవంగా జరిగింది. జీ తెలుగు తారలు, టాలీవుడ్ ప్రముఖులతో సందడిగా సాగిన జీ తెలుగు కుటుంబం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమ మొదటి భాగం అక్టోబర్ 12 సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!
టాలీవుడ్ ప్రముఖులు, బుల్లితెర నటీనటులతో సందడిగా సాగిన జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 పార్ట్ 1 కార్యక్రమానికి ఎనర్జిటిక్జోడీ రవి- లాస్య యాంకర్లుగా వ్యవహరించారు. జీ తెలుగు సీరియల్స్ కుటుంబాలన్నీ కలగలసి ఊరేగింపుతో ఘనంగా మొదలైన కార్యక్రమం అద్భుత ప్రదర్శనలు, అనుభవాలు, భావోద్వేగాల సమాహారంగా సాగుతుంది. ఇక, జీ తెలుగు పాపులర్ సీరియల్స్ పడమటి సంధ్యారాగం, నిండు నూరేళ్ల సావాసం నటీనటులు ఆడే ఫజిల్ గేమ్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. టాలీవుడ్ సీనియర్ నటీనటులు భానుచందర్, అర్చన ఈ కార్యక్రమానికి హాజరై తమ అనుభవాలను పంచుకుని నవ్వులు పూయించారు. జీ తెలుగు సీరియల్ జంటలతో సాగే మ్యూజికల్ డాన్స్ వార్‌లో సరిగమప సింగర్స్ పోటాపోటీ ప్రదర్శన ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ వేడుకకు మెగాబ్రదర్నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై జీ తెలుగుతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న సందర్భంగా డ్రామా జూనియర్స్ చిన్నారుల ప్రత్యేక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
యాక్షన్ ప్రియుల కోసం లైవ్‌లో గగన్ రౌడీలతో చేసే ఫైట్ సీక్వెన్స్ ఆసక్తికరంగా సాగుతుంది. డాన్స్ కాంపిటీషన్లో భాగంగా జూనియర్లు రెట్రో ప్రదర్శన ఇవ్వగా, సీనియర్లు ట్రెండింగ్ పాటలకు డాన్స్ చేసి అలరిస్తారు. రామలక్ష్మి & శౌర్య, ఆద్య & శ్రీను, రూప & రాజు, శ్రీకర్ & అవని జంటలు వేదికపై చేసే సందడి సరదాగా సాగుతుంది. సీనియర్ నటీమణులు అన్నపూర్ణమ్మ, వై.విజయ సీరియల్ కోడళ్లతో చేసే సంభాషణ కడుపుబ్బా నవ్విస్తుంది. అద్భుతమైన ప్రదర్శనలతో వినోదంగా సాగే ఈ కార్యక్రమంలో మీ అభిమాన నటులు ఏ అవార్డు గెలుచుకున్నారో తెలుసుకోవాలంటే జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 కార్యక్రమాన్ని మిస్ కాకుండా చూసేయండి.
రెడ్ కార్పెట్‌పై వెండితెర ప్రముఖుల సందడి.. బుల్లితెర తారల హంగామా.. అక్టోబర్ 11 శుక్రవారం రాత్రి 10:30 గంటలకు, జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2024 పార్ట్ 1 అక్టోబర్ 12 శనివారం సాయంత్రం 6 గంటలకు.. మీ జీ తెలుగులో!
Read Also: BB 4 : హిట్ కాంబో..బాలయ్య, బోయపాటి మరో చిత్రానికి ముహూర్తం ఫిక్స్
Read Also: Visvambhara : గూస్ బంప్స్ తెప్పించిన విశ్వంభర టీజర్.. ఇది వేరే లెవల్
తాజావార్తలు
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు