Site icon NTV Telugu

Trending News: నిస్వార్థ ప్రేమకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది?

Untitled 13

Untitled 13

Viral news: పట్టెడు అన్నం పెడితే చాలు మూగజీవులు ఎనలేని విశ్వాసాన్ని చూపిస్తాయి. వాటి ప్రేమలో ఎలాంటి స్వార్ధం ఉండదు. నిస్వార్ధ ప్రేమకు మూగ జీవులు నిలువెత్తు నిదర్శనం. అనడానికి ఇదే ఉదాహరణ. వివరాలలోకి వెళ్తే.. యుపి లోని అమ్రోహా లోని డిడోలి జోయా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్‌కున్వార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే అతను గత రెండు నెలల నుండి ఓ కోతికి ప్రతి రోజు క్రమం తప్పకుండా రొట్టిని అందిస్తున్నాడు. అలానే కోతి, రామ్‌కున్వార్ ఇద్దరు కలిసి ఆడుకునేవారు. దీనితో ఇద్దరి మధ్యన విడదియ్యరాని అనుబంధం ఏర్పడింది. ఎప్పటిలానే కోతి అక్టోబర్ 10 వ తేదీన రామ్‌కున్వార్ కోసం వచ్చింది.

Read also:Viral news: మొగుడు ఎందుకు మణీ వేస్ట్.. నాకు నేనే పెళ్లికి బెస్ట్

అయితే తనకి ఆహారం ఇచ్చి తన ఆకలి తీర్చే మనిషి నిర్జీవంగా పడుకుని వున్నాడు. అలా రామ్‌కున్వార్ ని చూసి నిర్ఘాంతపోయింది కోతి. అతను చనిపోయాడు అనే వార్త తను తెలుసుకుంది. తనతో ఆడుకుంటూ ఆకలి తీర్చిన మనిషి ఇక లేరు అనే విషయం తన మనసుని కలిచివేసింది. రామ్‌కున్వార్ మృత దేహాన్ని చూస్తూ గుండెలవిసేలా ఏడ్చింది. ఈ హృదయ విదారక ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. అంతే కాదు రామ్‌కున్వర్ సింగ్‌ను దహనసంస్కారాలతో పాటుగా అన్ని శతదిన కార్యక్రమాలకు కూడా హాజరు అయింది. అయితే ఆ కార్యక్రమాలకు హాజరు కావడం కోసం 40 కిలోమీటర్లు ప్రయాణించింది.

Exit mobile version