A Customer Shot Dead Robber Who Came With Fake Gun: పాపం ఆ దొంగ.. ఉద్యోగం లేక, జీవనం కొనసాగించడానికి ఇతర మార్గాలు దొరక్క.. పొట్ట కూటి కోసం దొంగగా అవతారం ఎత్తాడు. అయితే.. జనాలకు హాని కలిగించకుండా, దొంగతనం చేయాలని అనుకున్నాడు. ఫేక్ గన్‌తో బెదిరించి, డబ్బులు దోచుకోవాలని ప్లాన్ చేశాడు. ఫేక్ గన్ ఉంటే.. ఎలాంటి పొరపాటు జరగదని, సునాయాసంగా తాను దోపిడీ చేసుకోవచ్చని భావించాడు. కానీ, తాను చేస్తున్న ఈ తప్పుకు చావుదెబ్బ తినాల్సి వస్తుందని అతడు గ్రహించలేకపోయాడు. ఫేక్ గన్‌తో దొంగతనానికి పోయి, ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. ఈ ఘటన అమెరికా టెక్సాస్‌లోని సౌత్ హ్యూస్టన్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Robber Gun Fire: ఫేక్ తుపాకీతో వెళ్లాడు.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు
నకిలీ తుపాకీ తీసుకొని, ఒక దొంగ సడెన్‌గా ఓ రెస్టారెంట్‌లోకి చొరబడ్డాడు. తన వద్ద గన్ ఉందని, తనకు కావాల్సింది ఇస్తే మౌనంగా తిరిగి వెళ్లిపోతానని, లేకపోతే బుల్లెట్ల వర్షం కురిపిస్తానని బెదిరించాడు. అతని బెదిరింపుతో భయపడిపోయిన కస్టమర్లు.. అతడు చెప్పినట్లుగానే తమ వద్ద ఉన్న డబ్బులు తీసి ఇచ్చేశారు. కొందరు ప్రాణభయంతో ఆ రెస్టారెంట్ నుంచి బయటకు పరుగులు తీశారు. మరికొందరు అక్కడే ఉన్న టేబుళ్ల కింద దాచుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ఒక వ్యక్తి మాత్రం ఆ దొంగని చావుదెబ్బ తీశాడు. ఆ దొంగపై ఎదురుదాడి చేసేందుకు సరైన సమయం కోసం వేచి చూసిన సదరు కస్టమర్, దొంగ కాస్త అటువైపు తిరిగి బయటకు వెళ్తున్నప్పుడు తన దగ్గరున్న గన్‌తో కాల్చాడు. తొలుత దొంగ పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ, కస్టమర్ వరుసగా బుల్లట్ల వర్షం కురిపించడంతో కుప్పకూలిపోయాడు. అనంతరం ఆ కస్టమర్‌తో పాటు మిగతా వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Zimbabwe Cricket: జింబాబ్వే క్రికెట్‌లో విషాదం.. కోచ్‌లైన దంపతులు హఠాన్మరణం
సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు.. దొంగ తెచ్చిన తుపాకీని నకిలీ తుపాకీగా నిర్ధారించారు. అయితే.. దొంగను కాల్చి చంపిన ఆ కస్టమర్ ఎవరో ఇంకా తెలియరాలేదు. అతడ్ని పోలీసులు విచారించాల్సి ఉంది. తనని తాను కాపాడుకునేందుకు ఆ కస్టమర్ షూట్ చేశాడు కాబట్టి.. అమెరికా చట్టాల ప్రకారం అతనికి శిక్ష పడే అవకాశం లేదు. మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
🚨#WATCH: Self-defense shooting of armed robber at a restaurant
Watch as a brave customer at a taqueria shot restaurant shot and killed an armed criminal who was robbing from other customers. Houston police are now looking for that person for questioning pic.twitter.com/g7EYjms5PZ
— R A W S A L E R T S (@rawsalerts) January 7, 2023