NTV Telugu Site icon

Bangladesh clashes: బంగ్లాదేశ్‌ ఘర్షణల్లో 93కి చేరిన మృతుల సంఖ్య..

Bangladesh

Bangladesh

Bangladesh clashes: బంగ్లాదేశ్ భగ్గుమంటోంది. మరోసారి నిరసనలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఆదివారం రాజధాని ఢాకాలో నిరసనకారులు చేపట్టిన కార్యక్రమాలు హింసకు కారణమయ్యాయి. నిరసనకారులు పోలీసులు, అధికార అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల్లో 93 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని నిరసనకారులు ఆందోళనల్ని ప్రారంభించారు.నిరసనకారుల్ని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్లు ప్రయోగించారు.

Read Also: Double Ismart Trailer: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్.. సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు

ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి నిరవధిక దేశవ్యాప్తం కర్ఫ్యూని ప్రకటించింది. గత నెలలో ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, హసీనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై అక్కడి విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఆందోళనలు నిర్వహించారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో 200 మందికి పైగా మరణించారు.

అయితే, పోలీసుల అణిచివేతకు నిరసనగా ఆందోళనకారులు తాజా నిరసనలకు పిలుపునిచ్చారు. వరసగా 15 ఏళ్లకు పైగా పాలిస్తూ, జనవరి నెలలో నాలుగోసారి అధికారంలోకి వచ్చిన హసీనా ప్రభుత్వానికి ఈ నిరసనలు పెద్ద సవాలుగా మారాయి. ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిలస్ట్ పార్టీకి చెందిన విద్యార్థులు, కొన్ని సమూహాలు ప్రజలు ప్రభుత్వానికి సహకరించొద్దని, పన్నులు చెల్లించొద్దని పిలుపునిచ్చారు. ఈ అల్లర్లకు జమాతే ఇస్లామీ పార్టీ వారి విద్యా్ర్థి విభాగం హింసను ప్రేరేపించారని పీఎం హసీనా నిందించారు. దేశాన్ని అస్థిర పరిచేవారు విద్యార్థులు కాదని, ఉగ్రవాదులని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show comments