NTV Telugu Site icon

Lebanon: వాకీటాకీల పేలుడు ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య.. మరింత పెరిగే ఛాన్స్

Lebanon1

Lebanon1

లెబనాన్‌లో తాజాగా వాకీటాకీలు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. 300 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఆయా ప్రాంతాలు రక్తంతో తడిచిపోయాయి. మరో వైపు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం పేజర్ల పేలుళ్ల ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే బుధవారం కూడా మరోసారి పేలుళ్లు జరగడం లెబనాన్‌ను వణికి పోయింది. తాజాగా వాకీటాకీలు పేలడంతో వందలాది మంది గాయపడ్డారు. పేజర్ల పేలుళ్ల ఘటనలో మృతిచెందిన వారికి బుధవారం అంత్యక్రియలు నిర్వహిస్తుండగా రాజధాని బీరూట్‌లో ఈ పేలుళ్లు సంభవించాయి.

ఇది కూడా చదవండి: CM Chandrababu: ఎమ్మెల్యేలకు సీఎం స్వీట్‌ వార్నింగ్‌.. ఇసుక విషయంలో జోక్యం వద్దు..

లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని హిజ్బుల్లా ప్రకటించింది. వాకీటాకీలు పేలిపోవడం వల్లే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. కమ్యూనికేషన్ వ్యవస్థే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని తెలుస్తోంది. ఇటీవలే లెబనాన్.. అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను దిగుమతి చేసుకుంది. ఇందులోనే ఇజ్రాయెల్ పేలుడు పదార్ధాలు అమర్చి ఉంటుందని లెబనాన్ అనుమానిస్తోంది. తాజా ఘటనలు లెబనాన్ భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: Viral Post: భారతీయ వంటకాలపై నోరుపారేసుకున్న ఆస్ట్రేలియన్ యూట్యూబర్.. నెటిజన్లు ఫైర్

మంగళవారం పేజర్ల పేలుడు ఘటనలో 12 మంది చనిపోగా.. 2,800 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో లెబనాన్‌లోని ఇరాన్‌ రాయబారితో పాటు హిజ్బుల్లా కీలక నేతలున్నారు. ఒకేసారి వందలాది సంఖ్యలో పేజర్లు పేలిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేసింది. ఈ అనూహ్య దాడి వెనుక ఇజ్రాయెల్‌ హస్తముందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ మాత్రం స్పందించలేదు.

ఇది కూడా చదవండి: Lebanon: లెబనాన్‌లో మళ్లీ ప్రకంపనలు.. ఒక్కసారిగా పేలిన వాకీటాకీలు, మొబైల్స్

Show comments