World’s Richest Family: 700 కార్లు, రూ. 4 వేల కోట్ల ప్యాలెస్, 8 జెట్స్.. ప్రపంచంలో అత్యంత ధనిక కుటుంబం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World’s Richest Family: 700 కార్లు, రూ. 4000 కోట్ల విలువైన ప్యాలెస్, 8 జెట్ విమానాలు ఇదిల ప్రపంచంలో అత్యంత ధనిక కుటుంబం సొంతం. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్(ఎంబీజెడ్) ఈ కుటుంబానికి పెద్దగా ఉన్నారు. దుబాయ్‌లోని ఎంబీజెడ్ కుటుంబం రూ. 4087 కోట్ల విలువైన భవనం కలిగి ఉంది. ఇది మూడు పెంటగాన్‌ల పరిమాణంలో ఉంటుంది.
షేక్ మహ్మద్ బిన్ జాయెద్‌కి 18 మంది సోదరులు, 11 మంది సోదరీమణులు, 9 మంది పిల్లలు, 18 మంది మనవలు-మనవరాళ్లు ఉన్నారు. మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో పాటు ప్రపంచ చమురు నిల్వల్లో దాదాపు 6 శాతం ఈ కుటుంబం వద్దే ఉంది. సింగర్ రిహన్న బ్యూటీ బ్రాండ్ ఫంటీ నుంచి ఎలోన్ మస్క్ స్పేస్ Xవరకు అనేక కంపెనీల్లో ఈ కుటుంబానికి వాటాలు ఉన్నాయి. ఎంబీజెడ్ తమ్ముడు షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ వద్ద 5 బుగాట్టీ వేరాన్ కార్లు, ఒక లంబోర్గిని రెవెన్టన్, ఒక మెర్సిడెస్-బెంజ్ CLK GTR, ఒక ఫెరారీ 599XX మరియు ఒక Mc12ఆర్‌ఎన్‌తో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద SUVతో పాటు 700కి పైగా కార్లు ఉన్నాయి.
Also Read
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
- Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
Read Also: Israel: గాజా యూనివర్సిటీని బాంబులతో పేల్చేసిన ఇజ్రాయిల్.. వీడియో వైరల్..
ఈ కుటుంబం మొత్తం అబుదాబీలోని కస్ర్ అల్-వతన్ అనే అధ్యక్ష భవనంలో నివసిస్తుంది. యూఏఈలో ఈ కుటుంబం కలిగి ఉన్న అనేక ప్యాలెస్‌లలో ఇది అతిపెద్దది. దాదాపుగా 94 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఎంబీజెడ్ మరో సోదరుడు తహ్నౌన్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ కుటుంబ ప్రధాన పెట్టుబడి కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. దీని విలువ గత 5 ఏళ్లలో ఏకంగా 28,000 శాతం పెరిగింది. 235 బిలియన్ల విలువ కలిగిన ఈ కంపెనీ వ్యవసాయం, ఇంధనం, ఎంటర్టైన్మెంట్, సముద్ర వ్యాపారాల్లో పెట్టుబడులు కలిగి ఉంది. ఒక్క యూఏఈలోనే కాకుండా ఈ కుటుంబానికి పారిస్, లండన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఆస్తులు ఉన్నాయి.
2015లో న్యూయార్క్‌లోని ఒక నివేదిక ప్రకారం ఈ కుటుంబానికి ఉన్న ఆస్తుల్ని బ్రిటీష్ రాజకుటుంబ ఆస్తులతో పోల్చింది. 2008లో ఎంబీజెడ్‌కి సంబంధించిన అబుదాబి యునైటెడ్ గ్రూప్ UK ఫుట్‌బాల్ జట్టు మాంచెస్టర్ సిటీని రూ. 2,122 కోట్లకు కొనుగోలు చేసింది. మాంచెస్టర్ సిటీ, ముంబై సిటీ, మెల్‌బోర్న్ సిటీ మరియు న్యూయార్క్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌లను కూడా నిర్వహిస్తున్న సిటీ ఫుట్‌బాల్ గ్రూప్‌లో 81 శాతం కంపెనీని కలిగి ఉంది.
في كلّ ركنٍ قصة من وحي تاريخ دولة الإمارات العربية المتحدة!
اكتشفوا قصص تراث الأمة الغني والعظيم وخططوا لزيارتكم إلى #قصر_الوطن اليوم. #في_أبوظبي pic.twitter.com/Uv4zQH6bXb— Qasr Al Watan Tour (@QasrAlWatanTour) November 1, 2022
తాజావార్తలు
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
-
Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Ashok Gehlot: కాంగ్రెస్‌లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి