NTV Telugu Site icon

World’s Richest Family: 700 కార్లు, రూ. 4 వేల కోట్ల ప్యాలెస్, 8 జెట్స్.. ప్రపంచంలో అత్యంత ధనిక కుటుంబం..

World's Richest Family

World's Richest Family

World’s Richest Family: 700 కార్లు, రూ. 4000 కోట్ల విలువైన ప్యాలెస్, 8 జెట్ విమానాలు ఇదిల ప్రపంచంలో అత్యంత ధనిక కుటుంబం సొంతం. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్(ఎంబీజెడ్) ఈ కుటుంబానికి పెద్దగా ఉన్నారు. దుబాయ్‌లోని ఎంబీజెడ్ కుటుంబం రూ. 4087 కోట్ల విలువైన భవనం కలిగి ఉంది. ఇది మూడు పెంటగాన్‌ల పరిమాణంలో ఉంటుంది.

షేక్ మహ్మద్ బిన్ జాయెద్‌కి 18 మంది సోదరులు, 11 మంది సోదరీమణులు, 9 మంది పిల్లలు, 18 మంది మనవలు-మనవరాళ్లు ఉన్నారు. మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో పాటు ప్రపంచ చమురు నిల్వల్లో దాదాపు 6 శాతం ఈ కుటుంబం వద్దే ఉంది. సింగర్ రిహన్న బ్యూటీ బ్రాండ్ ఫంటీ నుంచి ఎలోన్ మస్క్ స్పేస్ Xవరకు అనేక కంపెనీల్లో ఈ కుటుంబానికి వాటాలు ఉన్నాయి. ఎంబీజెడ్ తమ్ముడు షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ వద్ద 5 బుగాట్టీ వేరాన్ కార్లు, ఒక లంబోర్గిని రెవెన్టన్, ఒక మెర్సిడెస్-బెంజ్ CLK GTR, ఒక ఫెరారీ 599XX మరియు ఒక Mc12ఆర్‌ఎన్‌తో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద SUVతో పాటు 700కి పైగా కార్లు ఉన్నాయి.

Read Also: Israel: గాజా యూనివర్సిటీని బాంబులతో పేల్చేసిన ఇజ్రాయిల్.. వీడియో వైరల్..

ఈ కుటుంబం మొత్తం అబుదాబీలోని కస్ర్ అల్-వతన్ అనే అధ్యక్ష భవనంలో నివసిస్తుంది. యూఏఈలో ఈ కుటుంబం కలిగి ఉన్న అనేక ప్యాలెస్‌లలో ఇది అతిపెద్దది. దాదాపుగా 94 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఎంబీజెడ్ మరో సోదరుడు తహ్నౌన్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ కుటుంబ ప్రధాన పెట్టుబడి కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. దీని విలువ గత 5 ఏళ్లలో ఏకంగా 28,000 శాతం పెరిగింది. 235 బిలియన్ల విలువ కలిగిన ఈ కంపెనీ వ్యవసాయం, ఇంధనం, ఎంటర్టైన్మెంట్, సముద్ర వ్యాపారాల్లో పెట్టుబడులు కలిగి ఉంది. ఒక్క యూఏఈలోనే కాకుండా ఈ కుటుంబానికి పారిస్, లండన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ ఆస్తులు ఉన్నాయి.

2015లో న్యూయార్క్‌లోని ఒక నివేదిక ప్రకారం ఈ కుటుంబానికి ఉన్న ఆస్తుల్ని బ్రిటీష్ రాజకుటుంబ ఆస్తులతో పోల్చింది. 2008లో ఎంబీజెడ్‌కి సంబంధించిన అబుదాబి యునైటెడ్ గ్రూప్ UK ఫుట్‌బాల్ జట్టు మాంచెస్టర్ సిటీని రూ. 2,122 కోట్లకు కొనుగోలు చేసింది. మాంచెస్టర్ సిటీ, ముంబై సిటీ, మెల్‌బోర్న్ సిటీ మరియు న్యూయార్క్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌లను కూడా నిర్వహిస్తున్న సిటీ ఫుట్‌బాల్ గ్రూప్‌లో 81 శాతం కంపెనీని కలిగి ఉంది.