NTV Telugu Site icon

Child Marriage: 13 ఏళ్ల బాలికకు 70 ఏళ్ల వృద్ధుడితో పెళ్లి.. ఎక్కడంటే..?

Pakistan

Pakistan

Child Marriage: పాకిస్తాన్ దేశంలోని స్వాత్ లోయలో ఓ 70 ఏళ్ల వృద్ధుడు, 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ వార్త అక్కడి మీడియాలో హెడ్‌లైన్‌గా మారింది. మైనర్ బాలికకు ఆమె తండ్రి, వృద్ధుడితో వివాహం చేశాడు. సమాచారం తెలిసిన పాక్ పోలీసులు వరుడితో పాటు బాలిక తండ్రిని అరెస్ట్ చేశారు. వివాహ వేడుక నిర్వహిస్తున్న అధికారి, సాక్షులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Israel: రఫాపై ఇజ్రాయెల్‌ దండయాత్ర.. భారీ దాడులకు ఏర్పాట్లు

ఇదిలా ఉంటే, మైనర్ వధువును వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాక్ చట్టాల ప్రకారం ఆడపిల్లల కనీస వివాహ వయసు 16 ఏళ్లు కాగా, అబ్బాయిలకు 18 సంవత్సరాలుగా ఉంది. కనీస వివాహ వయసును 18 ఏళ్లు పెంచాలని నిర్ణయాన్ని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలోని సంప్రదాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సంఘటల పాకిస్తాన్‌లో బాలిక దుస్థితిని వివరిస్తోంది.

ఇదిలా ఉంటే, మరోవైపు పాకిస్తాన్ వ్యాప్తంగా ముఖ్యంగా మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్ మైనర్ బాలికల కిడ్నాప్‌లు మాత్రం యథేచ్చగా జరుగుతున్నాయి. బలవంతంగా పెళ్లి చేసుకుని, మతం మార్చడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వివాహాలపై అక్కడి అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు.