Site icon NTV Telugu

Pakistan: పాక్‌లో దారుణం.. బార్బర్స్‌ని కిడ్నాప్ చేసి కాల్చి చంపిన టెర్రరిస్టులు..

Pakistan

Pakistan

Pakistan: పాముకు పాలు పోసి పెంచిన విధంగా టెర్రరిస్టులను పాకిస్తాన్ పెంచిపోషించింది, ఇప్పుడు ఆ పాముకే బలైపోతోంది. ఆ దేశంలో ఇటీవల కాలంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు, దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, సింధ్ వంటి ప్రాంతాల్లో ఉగ్రదాడులు నిత్యకృత్యమయ్యాయి. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా ఆర్మీ, పోలీసులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు.

Read Also: Karnataka: రామమందిర ఆందోళనలో పాల్గొన్న వ్యక్తి అరెస్ట్.. హిందువులను వేధిస్తున్నారంటూ బీజేపీ ఫైర్..

ఇదిలా ఉంటే తాజాగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉగ్రవాదులు ఆరుగురు బార్బర్స్‌ని కిడ్నాప్ చేసి కాల్చి చంపారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలోని మీర్ అలీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని స్థానిక మీడియా మంగళవారం నివేదించింది. పాక్ పంజాబ్ ప్రావిన్స్‌కి చెందిన బాధితులు స్థానిక బజార్‌లో కటింగ్ షాప్స్ నడుపుతున్నారు. సోమవారం వీరిని కిడ్నాప్ చేసి చంపేశారు, మంగళవారం వీరి మృ‌తదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే, ఈ హత్యలకు ఎవరు బాధ్యులనే దానిపై స్పష్టత లేదు. ఈ ఘటనకు ముందు ఈ ప్రాంతంలోనే ఐదుగురు కూలీలను మిలిటెంట్లు చంపేశారు. పాకిస్తాన్‌లో ఎన్నికలకు మరో నెల రోజులు మాత్రమే సమయం ఉన్న ఈ తరుణంలో వరసగా ఉగ్రదాడులు అక్కడి ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయి. పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (PICSS) థింక్ ట్యాంక్ యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం, ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో నవంబర్‌లో 51 ఉగ్రదాడులు జరిగితే 54 మంది మరణించగా.. 81 మంది గాయపడ్డారు.

Exit mobile version