Russia: రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 50 మంది దుర్మరణం

  • రష్యాలో ఘోర విమాన ప్రమాదం
  • విమానం కూలి 50 మంది ప్రయాణికులు, సిబ్బంది మృతి
Angara Airlines Plane2

Angara Airlines Plane2

రష్యాలో అదృశ్యమైన అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏఎన్-24 ప్రయాణీకుల విమానం కుప్పకూలిపోయింది. దీంతో విమానంలో ఉన్న ఇద్దరు పిల్లలు సహా 44 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది దుర్మరణం చెందారు. టిండా విమానాశ్రయానికి సమీపంలోనే విమానం కూలిపోయింది. విషాద వార్త తెలుసుకుని మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Bihar Elections: నకిలీ ఓట్లనే తొలగిస్తున్నాం.. నిరసనలపై ఈసీ క్లారిటీ

రష్యా తూర్పు ప్రాంతంలోని టిండా సమీపంలో దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏఎన్-24 ప్రయాణీకుల విమానం తొలుత అదృశ్యమైంది. అముర్ ప్రాంతంలోని తూర్పు ప్రాంతంలో అదృశ్యమైనట్లు వార్తా సంస్థ ఇంటర్‌ఫ్యాక్స్ తెలిపింది. ఖబరోవ్స్క్-బ్లాగోవెష్‌చెన్స్క్-టిండా మార్గంలో ప్రయాణిస్తుండగా.. గమ్యస్థానానికి చేరుకొనే సమయంలో ఎయిర్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయినట్లుగా వార్తలు వినిపించాయి.

ఇది కూడా చదవండి: SSMB29 : మహేశ్‌బాబు – రాజమౌళి మూవీపై పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తొలుత మొదటి ల్యాండింగ్ విఫలమైన తర్వాత రెండో ల్యాండింగ్ సమయంలో విమానం అదృశ్యమైనట్లుగా ఇంటర్ ఫ్యాక్స్ పేర్కొంది. విమానాశ్రయం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో సంబంధాలు తెగిపోయాయి. ఇక రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టగా ఎయిర్‌పోర్టు సమీపంలో కూలిపోయినట్లుగా గుర్తించారు.