Site icon NTV Telugu

Earthquake: ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్, ఢిల్లీలో భూప్రకంపనలు

Earthquakebihar

Earthquakebihar

ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్‌, భారత్‌లో భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం మధ్యాహ్నం 12:17 గంటలకు భూకంపం సంభవించినట్లుగా తెలిపింది. జమ్మూకాశ్మీర్, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయని నివేదికలు అందుతున్నాయి. 130 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా పేర్కొంది. అయితే ఆస్తి, ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం అందలేదు.

ఇది కూడా చదవండి: Tummala Nageswara Rao: సన్నబియ్యంతో భోజనం పెట్టిన దంపతులకు.. నూతన వస్త్రాలు పెట్టిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

భారత్, పాకిస్థాన్‌లో చాలా చోట్ల ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తరుచుగా ఆప్ఘనిస్థాన్‌లో భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల మయన్మా్ర్, థాయ్‌లాండ్‌లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. ప్రస్తుతం ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: Ajith : అజిత్‎కుమార్‌కు మరోసారి తప్పిన కారు ప్రమాదం..

Exit mobile version