Site icon NTV Telugu

Trump-Modi: ట్రంప్-మోడీ మధ్య 35 నిమిషాలు ఫోన్ కాల్.. 5 విషయాలు ప్రస్తావన

Modi3

Modi3

ప్రధాని మోడీ జీ 7 శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకు కెనడా వెళ్లారు. జీ 7 సమ్మిట్‌లో ఉన్న దేశాధినేతలంతా సమావేశానికి హాజరయ్యారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు మోడీ కూడా కెనడా వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోడీ భేటీ కావల్సి ఉంది. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల మధ్య ట్రంప్ అర్థాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: RT76 : రవితేజ – కిశోర్ తిరుమల టైటిల్ ఇదే

అయితే మంగళవారం రాత్రి ట్రంప్‌తో మోడీ ఫోన్ కాల్‌లో సంభాషించారు. దాదాపు ఇద్దరి మధ్య 35 నిమిషాల పాటు సంభాషణ జరిగినట్లుగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్) విషయంలో భారత్ ఎప్పుడూ మధ్యవర్తిత్వాన్ని కోరలేదని ట్రంప్‌నకు మోడీ తేల్చి చెప్పినట్లు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: G7 Summit: జీ 7 సమ్మిట్‌లో మెలోని-మాక్రాన్ గుసగుసలు.. వీడియో వైరల్

ఇక పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. నాలుగు రోజుల తర్వాత ఇరు దేశాలు కాల్పలు విరమణ ప్రకటించాయి. అయితే తన వల్లే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ ప్రకటించారు. క్రెడిట్ ట్రంప్ తీసుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడే భారత్ ఖండించింది. ఇరు దేశాల చర్చలతోనే కాల్పుల విరమణకు అంగీకారం జరిగిందని భారత్ తేల్చి చెప్పింది. కానీ ట్రంప్ మాత్రం పలుమార్లు తన వల్లే కాల్పుల విరమణ జరిగినట్లుగా చెప్పుకొచ్చారు. తాజాగా ట్రంప్‌తో జరిగిన ఫోన్ కాల్ సంభాషణలో కూడా మోడీ తేల్చి చెప్పారు. కాల్పుల విరమణకు ఎవరి మధ్యవర్తిత్వాన్ని తీసుకోలేదని.. ఇరు దేశాల చర్చలతోనే జరిగినట్లుగా మోడీ వెల్లడించారు. దాదాపుగా ఐదు అంశాలపై ఇద్దరి మధ్య సంభాషణ జరిగినట్లుగా వెల్లడించారు.

భారతదేశం ఎప్పుడూ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని.. అంగీకరించబోమని మోడీ తేల్చి చెప్పారు. ఇక ఉగ్రవాదంపై భారతదేశమంతా ఏకమై ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇక ఉగ్రవాదాన్ని ఎప్పుడూ యుద్ధంగానే భావిస్తామని మోడీ తెలిపారు.

ఇదిలా ఉంటే బుధవారం మధ్యాహ్నం వైట్‌హౌస్‌లో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ట్రంప్ భేటీ కానున్నారు. ఇద్దరు కలిసి లంచ్ చేయనున్నారు. ఇరాన్‌తో యుద్ధానికి దిగేందుకు అమెరికా సిద్ధపడుతోంది. ఇరాన్‌కు సరిహద్దు ప్రాంతమైన పాకిస్థాన్ అవసరం ఉంటుందని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సాయాన్ని అమెరికా తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే పాక్ ఆర్మీ చీఫ్‌తో ట్రంప్ భేటీ కాకముందు మోడీ ఫోన్ కాల్ సంభాషణ జరగడం, ఉగ్రవాదాన్ని సహించబోమని మోడీ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

 

Exit mobile version