NTV Telugu Site icon

USA: మంచు తుఫాన్‌తో అల్లాడుతున్న అమెరికా.. 31 మంది మృతి

Usa

Usa

31 Dead After Winter Storm In US: అమెరికాను మంచు తుఫాను అల్లాడిస్తోంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు. ముఖ్యంగా దేశంలోని తూర్పు ప్రాంతాలు మంచు తుఫాను ధాటికి ప్రభావితం అవుతున్నాయి. ఇప్పటి వరకు మంచు తుఫాన్ వల్ల 31 మంది మరణించారు. న్యూయార్క్ లోని బఫెలో ప్రాంతంలో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. మంచు తుఫాన్ కారణంగా న్యూయార్క్ నగరం అతలాకుతలం అవుతోంది. అత్యవసర సేవలపై హిమపాతం తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

Read Also: MK Stalin: నెహ్రూ వారసుడి మాటలు.. గాడ్సే వారసులను రెచ్చగొడుతున్నాయి.

తీవ్రమైన హిమపాతం వల్ల దేశంలో క్రిస్మస్ పండగను ఎంజాయ్ చేద్ధాం అనుకున్న ప్రజలకు నిరాశే మిగిలింది. భారీ హిమపాతం వల్ల జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. రోడ్లపై ఎక్కడికక్కడ మంచు పేరుకుపోయింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పలు రాష్ట్రాల అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. మంచు వల్ల దేశవ్యాప్తంగా వేలల్లో విమానాలు రద్దయ్యాయి. యూఎస్ఏలోని తూర్పు రాష్ట్రాల్లో 2 లక్షల కన్నా మంది క్రిస్మస్ రోజున విద్యుత్ లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రిస్మస్ రోజున వివిధ ప్రాంతాలకు వెళ్దాం అనుకున్న ప్రయాణికులు ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. మంచుతుఫాన్ వల్ల కొలరొడోలో నలుగురు, న్యూయార్క్ స్టేట్ లో సుమారుగా 12 మంది మరణించారు. తొమ్మిది రాష్ట్రాల్లో మరణాలు నమోదు అయ్యాయి.

తొమ్మిది రాష్ట్రాల్లో హిమపాతం ప్రభావం ఉంది. తుఫాను కారణంగా ఆదివారం 2,400 కంటే ఎక్కువ విమానాలను రద్దయ్యాయి. శనివారం 3,500, శుక్రవారం 6000 విమానాలను రద్దు చేశారు అధికారులు. అట్లాంటా, చికాగో, డెన్వర్, డెట్రాయిట్, న్యూయార్క్‌ ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు.

Show comments