NTV Telugu Site icon

Israel-Labanon war: లెబనాన్‌లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ దాడి.. 23 మంది సిరియన్లు మృతి

Labanon

Labanon

పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. గత వారం నుంచి లెబనాన్‌పై ఇజ్రాయెల్ దూకుడుగా పోతుంది. మొదట కమ్యూనికేషన్ వ్యవస్థపై దెబ్బకొట్టగా.. అటు తర్వాత రాకెట్లకు పని చెప్పింది. పేజర్లు, వాకీటాకీలు పేలి వందల మంది చనిపోయారు. అనంతరం రాకెట్ల దాడి కారణంగా 557 మంది మృత్యువాత పడగా.. వేలాది మంది తీవ్రగాయాలు పాలయ్యారు. అయినా కూడా ఇజ్రాయెల్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మరింత వేగంగా దూసుకెళ్తోంది. బుధవారం జరిపిన దాడుల్లో కూడా పదుల కొద్ది చనిపోయారు. తాజాగా గురువారం లెబనాన్‌లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 23 మంది సిరియన్లు చనిపోయినట్లు లెబనాన్‌ వార్తాసంస్థ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Bengaluru Murder Case: “మహాలక్ష్మీతో విసిగిపోయాను”.. నిందితుడి సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు..

ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే భారత్ పౌరులు లెబనాన్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. భారత్‌తో పాటు యూకే సహా పలు దేశాలు.. తమ పౌరులకు ఆదేశాలు జారీ చేశాయి. వెంటనే లెబనాన్ వదిలి వెళ్లాలని కోరింది.

ఇది కూడా చదవండి: Mumbai Rain: ముంబైలో వర్ష బీభత్సం.. ఓపెన్ డ్రైన్‌లో పడి మహిళ మృతి

ఇదిలా ఉంటే లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు పశ్చిమాసియా దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. యుద్ధానికి విరామం ప్రకటించేలా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ పోరాటంలో 21 రోజుల కాల్పుల విరమణ కోసం అమెరికా, దాని మిత్రదేశాలు చేసిన ఒత్తిడికి తమ ప్రభుత్వం స్పందించలేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు గురువారం చెప్పారు. పూర్తి శక్తితో పోరాటాన్ని కొనసాగించాలని సైన్యానికి నెతన్యాహు ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ సమీక్ష