Missile Arrack: ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా నిన్న బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ మార్లిన్ లువాండాని మిస్సైళ్లతో దాడి చేశారు. జనవరి 26 రాత్రి సమయంలో చమురు నౌక నుంచి ఇండియన్ నేవీకి ఎస్ఓఎస్ అందింది. ఈ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశ్ వ్యక్తి ఉన్నారు.
గల్ఫ్ ఆఫ్ ఏడెన్ గుండా నౌక వెళ్తున్న సమయంలో హౌతీలు దాడులు చేశారు. నౌక నుంచి వచ్చిన SOS కాల్‌కు భారత నౌకాదళం స్పందించింది. INS విశాఖపట్నం రెస్య్కూ ఆపరేషన్ కోసం మోహరించబడినట్లు నేవీ ఈ రోజు వెల్లడించింది. దాడి తర్వాత ఆయిల్ ట్యాంకర్ నౌకలో మంటలు చెలరేగాయి. ఐఎన్ఎస్ విశాఖపట్నం కార్గో షిప్‌కి సాయం చేస్తున్నట్లు నేవీ వెల్లడించింది. భారత నావికాదళం దృఢంగా ఉంది మరియు వ్యాపార నౌకలను రక్షించడానికి మరియు సముద్రంలో భద్రతకు భరోసా ఇవ్వడానికి కట్టుబడి ఉంది” అని నౌకాదళం ప్రకటనలో తెలిపింది.
Read Also: CM YS Jagan: మరో 70 రోజుల్లోనే ఎన్నికలు.. క్లారిటీ ఇచ్చిన సీఎం..
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్‌కి మద్దతుగా నిలుస్తున్న హౌలీలు వెస్ట్రన్ దేశాలు, ఇజ్రాయిల్‌తో సంబంధం ఉన్న వ్యాపార నౌకల్ని టార్గెట్ చేస్తున్నారు. జనవరి 18న, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో భారతీయ సిబ్బందితో కూడిన వ్యాపార నౌక డ్రోన్ దాడికి గురైంది. ఆ సమయంలో INS విశాఖపట్నం సాయం అందించింది. దీనికి ముందు 21 మంది భారతీయ సిబ్బందితో ఉన్న MV కెమ్ ప్లూటో డిసెంబర్ 23న భారతదేశ పశ్చిమ తీరంలో డ్రోన్ దాడికి గురి అయింది. అదే రోజున మరో వాణిజ్య నౌకపై కూడా ఇలాగే డ్రోన్ అటాక్ జరిగింది. ఈ షిప్‌లో 25 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు.