4 Days Works: 4 రోజులే పనిదినాలు.. కటింగ్స్ లేకుండా జీతాలు.. ఎక్కడంటే..!
- ఉద్యోగులకు గుడ్‌న్యూస్
- 4రోజుల పని.. కటింగ్స్ లేకుండా జీతాలు
- యూకే కంపెనీలు సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పని దినాలు గురించి చర్చలు జరుగుతున్న వేళ యూకే కంపెనీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. వారానికి నాలుగు రోజులే పని దినాలుగా ప్రకటించాయి. ఎలాంటి కోతలు లేకుండా జీతాలు ఇస్తామని వెల్లడించాయి. ఇలా దాదాపు 200 కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ కంపెనీల్లో 5,000 మందికిపైగా ఉద్యోగాలు చేస్తున్నారు. వీటిలో ఎక్కువ భాగం స్వచ్ఛంద సంస్థలు, మార్కెటింగ్, టెక్నాలజీ వంటి రంగాలకు చెందినవి. 4 డే వీక్ ఫౌండేషన్ ద్వారా ప్రచారం చేస్తున్న ఈ నిర్ణయానికి ఇప్పుడు సానుకూలంగా నిర్ణయం వచ్చిందని చెప్పవచ్చు. వారానికి నాలుగు రోజుల పని దినాలతో ఉద్యోగులు 50 శాతం ఎక్కువ ఖాళీ సమయాన్ని పొందుతారని ఫౌండేషన్ ప్రచార డైరెక్టర్ జో రైల్ అన్నారు.
ఇది కూడా చదవండి: Vishwak Sen: విశ్వక్ సేన్ దెబ్బకి సినిమా క్యాన్సిల్?
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్‌కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
- Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్‌లు విధించేలా చట్టం
ఈ విధానం ఉద్యోగులు, యజమానులకు ఉపయోగకరమైనదని అనేక బ్రిటిష్ కంపెనీలు భావిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా అనుసరిస్తున్నాయి. ప్రారంభంలో మార్కెటింగ్, ప్రకటనలు, ప్రజా సంబంధాలు వంటి రంగాలలో దాదాపు 30 కంపెనీలు ఈ మార్పును ఆమోదించాయి. ఆ తర్వాత ఛారిటీ, ఎన్జీవో, సామాజిక సంరక్షణ రంగాల నుంచి 29 సంస్థలు, టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాలలో 24 సంస్థలు ఈ మార్పు ఆమోదించాయి. ఈ పద్ధతి ద్వారా ఉత్పాదకతను పెంచడానికి, ప్రతిభను ఆకర్షించడానికి సరిగ్గా ఉపయోగపడతాయని మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.
వారానికి నాలుగు రోజులే పని దినాలు కావడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారంలో ఉద్యోగులకు అదనంగా దొరికే సమయం, వారి జీవితాలను సంతృప్తికరంగా, ఆనందంగా గడపడానికి తోడ్పడుతుందన్నారు.
ఇది కూడా చదవండి: Esther Anuhya Case: ఎస్తేర్ అనూహ్య హత్యాచార కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. చేతులెత్తేసిన పేరెంట్స్
తాజావార్తలు
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
-
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్‌కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!