NTV Telugu Site icon

Pakistan: పాకిస్థాన్లో దారుణం.. బొగ్గు గనిలో 20 మంది కార్మికులను చంపిన టెర్రరిస్టులు..

Pak

Pak

Pakistan: పాకిస్థాన్‌ దేశంలోని బలూచిస్థాన్ ప్రావిన్సులో దారుణం చోటు చేసుకుంది. తుపాకితో బొగ్గు గనిలోకి ప్రవేశించిన సాయుధులు 20 మంది కార్మికులను కాల్చి చంపేశారు. ప్రావిన్సులోని దికీ జిల్లాలో ఉన్న జునైద్ కోల్ కంపెనీకి చెందిన బొగ్గు గని వసతి గృహాల్లోకి ప్రవేశించిన టెర్రరిస్టులు కార్మికులను చుట్టుముట్టి కాల్పులు చేశారు. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Read Also: Vettaiyan OTT: ఆ ఓటీటీ చేతికే ‘వేట్టయాన్’ రైట్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

ఇక, మృతుల్లో ఎక్కువ మంది బలూచిస్థాన్ ప్రావిన్సులోని పష్తున్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. అలాగే, మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన వారు ఉన్నారు. వచ్చే వారం ఇస్లామాబాద్‌లోని షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు. ఇక, బలూచిస్థాన్‌లో ఎక్కువగా తెహ్రీక్ -ఇ- తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) తరచూ ఉగ్రదాడులకు పాల్పడుతూ ఉంటుంది. ఈ ఘటన కూడా దీని పనేనని అనుమానిస్తున్నారు.