Pakistan: పాకిస్థాన్లో దారుణం.. బొగ్గు గనిలో 20 మంది కార్మికులను చంపిన టెర్రరిస్టులు..
- బలూచిస్థాన్ ప్రావిన్సులో తీవ్ర విషాదం..
- జునైద్ కోల్ కంపెనీ గనిలో 20 మంది కార్మికులను చంపిన ఉగ్రవాదులు..
- మృతుల్లో ముగ్గురు.. గాయపడిన వారిలో నలుగురు ఆఫ్ఘనిస్థాన్ పౌరులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్ దేశంలోని బలూచిస్థాన్ ప్రావిన్సులో దారుణం చోటు చేసుకుంది. తుపాకితో బొగ్గు గనిలోకి ప్రవేశించిన సాయుధులు 20 మంది కార్మికులను కాల్చి చంపేశారు. ప్రావిన్సులోని దికీ జిల్లాలో ఉన్న జునైద్ కోల్ కంపెనీకి చెందిన బొగ్గు గని వసతి గృహాల్లోకి ప్రవేశించిన టెర్రరిస్టులు కార్మికులను చుట్టుముట్టి కాల్పులు చేశారు. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also: Vettaiyan OTT: ఆ ఓటీటీ చేతికే ‘వేట్టయాన్’ రైట్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
Also Read
- Tiffany Trump: తాజ్ మహల్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ బిడ్డ.. భారత్‌లో టిఫనీ సందడి మామూలుగా లేదుగా!
- Pete Hegseth: ఇరాన్‌పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
- Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
- Lashkar-e-Taiba: భారత్‌ను టార్గెట్ చేస్తూ బార్డర్ల కొత్త ఉగ్ర కోట.. నిఘా వర్గాల చేతికి లష్కర్ సీక్రెట్ మ్యాప్!
ఇక, మృతుల్లో ఎక్కువ మంది బలూచిస్థాన్ ప్రావిన్సులోని పష్తున్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. అలాగే, మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన వారు ఉన్నారు. వచ్చే వారం ఇస్లామాబాద్‌లోని షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు. ఇక, బలూచిస్థాన్‌లో ఎక్కువగా తెహ్రీక్ -ఇ- తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) తరచూ ఉగ్రదాడులకు పాల్పడుతూ ఉంటుంది. ఈ ఘటన కూడా దీని పనేనని అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్‌ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్‌లో బిగ్ ఛేంజ్..
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్‌దే ఐపీఎల్ 2026 టైటిల్?
-
Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..