Armenia: ఆర్మేనియా, అజర్ బైజాన్ మధ్య తీవ్ర ఉద్రికత్త నడుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య నగర్నో-కారాబఖ్ ప్రాంతం విదాస్పదంగా మారింది. ఈ ప్రాంతంలోని ఆర్మేనియన్లపై అజర్ బైజాన్ దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి తరలివెళ్తున్న ఆర్మేనియన్లు భారీ ప్రమాదం బారిన పడ్డారు. గ్యాస్ స్టేషన్ వద్ద భారీ ప్రమాదం సంభవించడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది గాయపడ్డారు.