NTV Telugu Site icon

US: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి

Us

Us

అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు.శుక్రవారం తెల్లవారుజామున 1:07 గంటలకు హాలోవీన్ వేడుకల సందర్భంగా సామూహిక కాల్పులు జరిగాయి. జైలెన్ డ్వేన్ ఎడ్గార్ అనే 17 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. గతంలో ఇతడు దొంగతనం కేసులో 2023లో అరెస్టయ్యాడని పేర్కొ్న్నారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Tirupati: కపిలేశ్వర స్వామి ఆలయంలో నెల రోజులు పాటు హోమాలు..

సెంట్రల్ బౌలేవార్డ్, ఆరెంజ్ అవెన్యూ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు తొలుత అధికారులకు సమాచారం అందిందని ఓర్లాండో పోలీస్ చీఫ్ ఎరిక్ స్మిత్ విలేకరుల సమావేశంలో తెలిపారు. అనంతరం వాషింగ్టన్ స్ట్రీట్, ఆరెంజ్ అవెన్యూ ప్రాంతంలో కొన్ని నిమిషాల తర్వాత కాల్పులు జరిగినట్లు రెండో సమాచారం అందిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.

హాలోవీన్ ఉత్సవాల కోసం వందలాది మంది 7 వేర్వేరు క్లబ్‌ల్లో వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఇద్దరు చనిపోయారు. ఆరుగురు గాయపడ్డారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బాధితుల వయస్సు 19 నుంచి 31 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇక క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

సంఘటన జరిగిన కొద్దిసేపటికే పోలీసులు నిందితుడిని 17 ఏళ్ల జైలెన్ డ్వేన్ ఎడ్గార్‌గా గుర్తించారు. రెండోసారి జనంపై కాల్పులు జరపడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 2023లో నిందితుడు చోరీ కేసులో అరెస్టయ్యాడు. నిందితుడు పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు చనిపోయారు.

ఇది కూడా చదవండి: Merugu Nagarjuna: రాజకీయాలలో ఎదుగుతున్న ఒక దళితుడిని టార్గెట్ చేస్తున్నారు.. తప్పు తేలితే దేనికైనా సిద్ధం

Show comments