US: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి
- అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు
- ఇద్దరు మృతి.. ఆరుగురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు.శుక్రవారం తెల్లవారుజామున 1:07 గంటలకు హాలోవీన్ వేడుకల సందర్భంగా సామూహిక కాల్పులు జరిగాయి. జైలెన్ డ్వేన్ ఎడ్గార్ అనే 17 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. గతంలో ఇతడు దొంగతనం కేసులో 2023లో అరెస్టయ్యాడని పేర్కొ్న్నారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Tirupati: కపిలేశ్వర స్వామి ఆలయంలో నెల రోజులు పాటు హోమాలు..
Also Read
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
సెంట్రల్ బౌలేవార్డ్, ఆరెంజ్ అవెన్యూ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు తొలుత అధికారులకు సమాచారం అందిందని ఓర్లాండో పోలీస్ చీఫ్ ఎరిక్ స్మిత్ విలేకరుల సమావేశంలో తెలిపారు. అనంతరం వాషింగ్టన్ స్ట్రీట్, ఆరెంజ్ అవెన్యూ ప్రాంతంలో కొన్ని నిమిషాల తర్వాత కాల్పులు జరిగినట్లు రెండో సమాచారం అందిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.
హాలోవీన్ ఉత్సవాల కోసం వందలాది మంది 7 వేర్వేరు క్లబ్‌ల్లో వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాల్లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఇద్దరు చనిపోయారు. ఆరుగురు గాయపడ్డారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బాధితుల వయస్సు 19 నుంచి 31 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇక క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
సంఘటన జరిగిన కొద్దిసేపటికే పోలీసులు నిందితుడిని 17 ఏళ్ల జైలెన్ డ్వేన్ ఎడ్గార్‌గా గుర్తించారు. రెండోసారి జనంపై కాల్పులు జరపడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 2023లో నిందితుడు చోరీ కేసులో అరెస్టయ్యాడు. నిందితుడు పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు చనిపోయారు.
ఇది కూడా చదవండి: Merugu Nagarjuna: రాజకీయాలలో ఎదుగుతున్న ఒక దళితుడిని టార్గెట్ చేస్తున్నారు.. తప్పు తేలితే దేనికైనా సిద్ధం
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!