Israel Hamas: ఇజ్రాయిల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ తొలి దశ ముగింపుకు వస్తోంది. అయితే, ఈ దశలో చివరి షెడ్యూల్‌లో భాగంగా శనివారం ఆరుగురు ఇజ్రాయిలీలను విడుదల చేసింది. మొత్తం మీద ఈ దశలో 33 మంది ఇజ్రాయిలీలను హమాస్ విడుదల చేసింది. ఇందులో ఐదుగురు థాయ్‌లాండ్ బందీలు కూడా ఉన్నారు.
మరోవైపు, 2014లో నిర్భందించబడిని మరణించిన ఇజ్రాయిలీ సైనికుడి మృతదేహతో సహా 63 మంది బందీలను హమాస్ ఇప్పటి వరకు తమ చెరలోనే ఉంచుకుంది. ఉగ్రవాదులు అపహరించిన ఇజ్రాయిల్ మహిళ షిరి బియాస్ తప్పుడు మృతదేహాన్ని హమాస్ ఇచ్చిన తర్వాత, ఈ కాల్పుల విమరణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు, ఆమె అవశేషాలను శనివారం తెల్లవారుజామున ఇచ్చారు. కాల్పుల విరమణలో భాగంగా మొదటి దశలో ఇప్పటివరకు ఇజ్రాయిల్ 2000 మంది ఖైదీలను విడుదల చేస్తోంది.
Read Also: CM Chandrababu: ఉగాది పండుగ రోజు నుంచి పీ4 విధానం ప్రారంభించనున్న ఏపీ సర్కార్
అక్టోబర్ 07, 2023న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి, 251 మంది ఇజ్రాయిలీలను కిడ్నాప్ చేశారు. 1200 మందిని హతమర్చారు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయిల్, గాజాపై యుద్ధం చేసింది. ఉగ్రవాదులతో సహా 48000 మంది పాలస్తీనియన్లు ఈ యుద్ధంలో మరణించారు. మొత్తం 251 మంది బందీల్లో ఇప్పటి వరకు హమాస్, 141 మందిని విడుదల చేసింది. ఇందులో నలుగురు మరణించారు.
ఇంకా 62 మంది బందీలు ఉన్నారు, వీరిలో 35 మంది చనిపోయినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. బందీలుగా ఉన్న సైనికుల సంఖ్య 13గా ఉంది. వీరిలో ఏడుగురు మరణించినట్లు తెలిపింది. ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకున్న బందీల మృతదేహాల 40. రెస్క్యూ ఆపరేషన్‌లో 8 మందిని ఇజ్రాయిల్ సజీవంగా రక్షించింది. బందీల్లో ఇజ్రాయిల్ కాని వారిలో ఐదుగురు ఉన్నారు. వీరులో ముగ్గురు థాయ్, ఒకరు నేపాల్, ఒకరు టాంజానియాకు చెందిన వారు.