NTV Telugu Site icon

Indonesia: 45 ఏళ్ల మహిళ మిస్సింగ్.. కొండచిలువ కడుపు కోసి చూడగా అంతా షాక్..

Python Swallows Woman

Python Swallows Woman

Indonesia: ఇండోనేషియాలో విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఇండోనేషియాలో 45 ఏళ్ల మహిళను 16 అడుగుల(5 మీటర్లు) కొండచిలువ మింగేసింది. 45 ఏళ్ల ఫరీదా అనే మహిళను కొండచిలువ కడుపులో కనుగొన్నట్లు శనివారం అధికారులు వెల్లడించారు. బాధితురాలు దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని కలెమ్‌పాంగ్ గ్రామ నివాసి. నలుగురు పిల్లల తల్లైన ఫరీదా గురువారం రాత్రి తప్పిపోయింది. బయటకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగారాలేదు. ఆమె కోసం ఎంత వెతికినా దొరకలేదు.

Read Also: War 2 : హృతిక్ రోషన్ ‘వార్ 2’ లో ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..?

ఆమె భర్త వెతుకుతున్న సమయంలో ఓ ప్రాంతంలో ఆమెకు సంబంధించిన వస్తువులను కనుగొన్నాడు. అతనికి అనుమానం వచ్చి ఆ ప్రాంతంలో గాలించగా, ఓ కొండచిలువను చూశాడు. దాని పొట్ట పెద్దగా ఉండటంతో అనుమానం వచ్చి అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు కొండచిలువ కడుపు తెరిచిచూడగా, ఫరీదా తల కనిపించింది. ఫరీదా పాము లోపల పూర్తిగా దుస్తులు ధరించి ఉండటాన్ని గమనించారు.

ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని అక్కడి అధికారులు చెప్పారు. ఇటీవల సంవత్సరాల్లో ఇండోనేషియాలో కొండచిలువ మనుషులపై దాడులు చేసి మింగడంతో చాలా మంది మరణించారు. గత సంవత్సరం ఆగ్నేయ సులవేసిలోని టినాంగ్‌గెయా జిల్లాలో ఒక రైతులు ఇలాగే 8 మీటర్ల కొండచిలువ చంపి మింగేసింది. 2018లో, ఆగ్నేయ సులవేసిలోని మునా పట్టణంలో ఏడు మీటర్ల కొండచిలువ లోపల 54 ఏళ్ల మహిళ చనిపోయి కనిపించింది.