పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో 13 మంది పాకిస్థాన్ సైనికులు మృతిచెందారు. వాయువ్య పాకిస్థాన్‌లో ఈ ఆత్మాహుతి బాంబు దాడి జరిగినట్లగా అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Karnataka: 5 పులుల మృతి కేసులో ముగ్గురు అరెస్ట్.. ఎందుకు చంపారంటే..!
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం.. సైనిక కాన్వాయ్‌పైకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా బాంబు పేలడంతో 13 మంది సైనికులు చనిపోగా.. మరో 10 మంది గాయపడ్డారు. అంతేకాకుండా సమీపంలోని 19 మంది పౌరులు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
ఆత్మాహుతి దాడి ఘటనలో 13 మంది సైనికులు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారని, 19 మంది పౌరులు గాయపడ్డారని స్థానిక ప్రభుత్వ అధికారి మీడియాకు వెల్లడించారు. ఇక ఈ ఘటనలో సమీపంలోని ఇళ్ల కూడా ధ్వంసం అయ్యాయి. ఆరుగురు చిన్నారులకు కూడా గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడింది ఏ సంస్థనో ఇంకా ప్రకటించలేదు. తరచుగా ఈ ప్రాంతంలో తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) దాడులకు పాల్పడుతోంది.
ఇది కూడా చదవండి: BJP President: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధం!