Site icon NTV Telugu

Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీగా వరదలు.. 13 మంది మృతి

Philippines Floods

Philippines Floods

13 Killed, 23 Missing In Philippines Floods: ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. ఎప్పుడూ లేని విధంగా వరదలు రావడంతో ప్రజలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది వర్షాలు, వరదల కారణంగా మరణించారు. పలువురు గల్లంతు అయ్యారు. చాలా మంది నిరాశ్రయులు అయ్యారు. క్రిస్మస్ రోజు కురిసిన భారీ వర్షాల వల్ల దేశంలో ఇప్పటి వరకు 13 మంది మరణించారు. మరో 23 మంది మత్స్యకారులు తప్పిపోయారు. దేశంలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించడమే కాకుండా ఇప్పటి వరకు 45,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. వీరిందరిని సహాయక కేంద్రాలకు తరలించారు. వాతావరణం బాగా లేకున్నా.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. ప్రస్తుతం వీరంతా గల్లంతయ్యారు.

Read Also: India Squad: శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లకు భారత జట్టు ప్రకటన

పొంగిపొర్లుతున్న నదుల వల్ల పన్నెండు రోడ్లు మునిగిపోయాయి. దీంతో దేశంలో రవాణాకు అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫిలిప్పీన్స్ వాతావరణ కేంద్రం ప్రకారం.. షీర్ లైన్ అనే వాతావరణ పరిస్థితులు కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. వేడి, చల్లని గాలులు కలిసి భారీ మేఘాలను ఏర్పరచడం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడే అవకాశం ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు.

రాజధాని మనీలకు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామరైన్స్ సుర్ ప్రావిన్స్ లో వేర్వేరు ఘటనల్లో మునిగిపోయి బాలికతో పాటు వృద్ధుడు మరణించారు. దేశంలోని దక్షిణ ప్రావిన్సులో నలుగురు వ్యక్తులు మరణించారు. మొత్తంగా దేశంలో ఇప్పటి వరకు 13 మంది మరణించారు. రెస్క్యూ ప్రయత్నాలను కొనసాగుతున్నాయి. ఈ వర్షాలు దేశంలోని వ్యవసాయంపై భారీగా ప్రభావం చూపించాయి.

Exit mobile version