Site icon NTV Telugu

కాబూల్‌ నుంచి ఢిల్లీకి 129 మంది భారతీయులు…

కాబూల్‌ నుంచి 129 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్‌ ఇండియా విమానంలో వీరంతా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆఫ్ఘన్‌లో చిక్కుకుపోయిన మన వాల్లను తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం వెళ్లింది. అయితే, విమానం బయలుదేరిన కొద్ది సేపటికే కాబూల్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారని తెలియడంతో ఆందోళన నెలకొంది. అలాగే, కాబూల్‌ ఎయిర్‌ పోర్టులో దిగేందుకు అనుమతిచ్చేందుకు ATC అందుబాటులో లేకపోవడంతో మరో ఉత్కంఠకు తెరలేచింది. అదే సమయంలో శత్రువులకు లక్ష్యంగా మారకూడదనే ఉద్దేశంతో విమాన రాడార్‌ వ్యవస్థను ఆఫ చేశారు పైలెట్‌. చివరికి గంటల ఆలస్యంగా విమానం ల్యాండింగ్‌కు అనుమతి లభించింది. తర్వాతో అదే విమానంలో 129 మంది భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చారు. మరింత మంది భారతీయుల్ని స్వదేశానికి తరలించేందుకు C-17 విమానాన్ని సిద్ధంగా ఉంచింది ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌.

Exit mobile version