Pakistan: పాకిస్తాన్ పెంచుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు ఆ దేశాన్ని కబలించాలని చూస్తున్నారు. బలూచిస్తాన్‌లో ‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ’, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ తాలిబాన్లు ఆ దేశానికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆర్మీ కూడా భయపడుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు రాష్ట్రాల్లో పోలీసులు, సైన్యం టార్గెట్‌గా తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్ని ఎదుర్కోలేక పాకిస్తాన్ చతికిలపడుతోంది.
Read Also: Pakistan Minister: ఔరంగజేబు పాలనతో తప్పా భారత్ ఎప్పుడూ ఐక్యంగా లేదు..
తాజాగా పాక్ తాలిబాన్లపై పాకిస్తాన్ ఆర్మీ సైనిక చర్య చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాక్ సైనికులతో పాటు ఉగ్రవాదులు కూడా మరణించారు. ఈ సైనిక చర్యలో 11 మంది పాక్ సైనికులు మరణించారు. వీరిలో లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ కూడా ఉన్నట్లు పాక్ ఆర్మీ ప్రకటించింది. 19 మంది ఉగ్రవాదులు మరణించినట్లు ఆర్మీ వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఒరాక్జాయ్ జిల్లాలో ఈ దాడి జరిగింది.
గత నెలలో ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని కరార్ జిల్లాలో ఒక రహస్య స్థావరంపై పాక్ ఆర్మీ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 17 మంది టీటీపీ ఉగ్రవాదులు మరణించారు. ముగ్గురు పోలీస్ అధికారులు గాయపడ్డారు. డేరా ఇస్మాయిల్ ఖాన్ లో జరిగిన ఆపరేషన్‌లో 13 మంది పాక్ తాలిబాన్లు మరణించారు.
