India Billionaires 2025: భారతదేశం బిలియనీర్లకు కొత్త కేంద్రంగా మారుతోంది. దేశంలో సంపన్న వ్యక్తుల సంఖ్య ఏడాది నుంచి వేగంగా పెరుగుతోంది. తాజాగా M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 విడుదలైంది. ఈ లిస్ట్ ప్రకారం.. భారతీయ బిలియనీర్ల సంఖ్య 350 కంటే ఎక్కువకు పెరిగింది. ఈ సంఖ్య గత 13 సంవత్సరాలలో ఆరు రెట్లు పెరిగింది. ముఖేష్ అంబానీ మరోసారి అత్యంత ధనవంతుల ర్యాంకింగ్‌లో ఆధిపత్యం చెలాయించారు. నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ మొదటిసారి బిలియనీర్స్ క్లబ్‌లో చేరారు. కాగా.. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 లో చేర్చబడిన బిలియనీర్ల మొత్తం సంపద ₹167 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో దాదాపు సగం.
READ MORE: Yashashree Rao: తెలుగులో హీరోయిన్గా మరాఠీ సోషల్ మీడియా భామ!
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబం నికర విలువ ₹9.55 లక్షల కోట్లుగా అంచనా వేశారు. గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం ₹8.15 లక్షల కోట్ల నికర విలువతో రెండవ స్థానంలో ఉన్నారు. ₹2.84 లక్షల కోట్ల నికర విలువతో రోష్ని నాడర్ మల్హోత్రా ఈ జాబితాలో మూడవ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో ఆమె అత్యున్నత ర్యాంక్ పొందిన మహిళా బిలియనీర్ అయ్యారు. 2025 ధనవంతుల జాబితాలో పెర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు, 31 ఏళ్ల అరవింద్ శ్రీనివాస్ ₹21,190 కోట్ల నికర విలువతో భారత్‌లోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ అయ్యారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ తొలిసారిగా జాబితాలో కనిపించారు. ₹12,490 కోట్ల నికర విలువతో అగ్రశ్రేణి బిలియనీర్ల క్లబ్‌లో చేరారు. అత్యధికంగా సంపద పెరిగిన బిలియనీర్ నీరజ్ బజాజ్, ఆయన కుటుంబం, రూ. 69,875 కోట్ల పెరుగుదలతో వారి నికర విలువ ఇప్పుడు రూ. 2.33 లక్షల కోట్లకు చేరుకుంది. ముంబై సంపన్నుల కేంద్రంగా కొనసాగుతోంది.
