Gold Prices: ప్రస్తుతం సామాన్యులు పసిడి కొనుగోలు చేయడం అంటే ప్రశ్నార్థంగా మారింది. దీనికి కారణం రోజురోజుకి పసిడి ధరలు అమాంతం పెరగడమే. అయితే, గత వారం రోజుల నుండి అమాంతం పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. నేడు (జులై 24) ఒక్కరోజే రూ.1,360 తగ్గి ప్రసిది కొనుగోలు దారులకు ఊరటను ఇచ్చింది. లక్ష రూపాయలు దాటిన బంగారం ధరలు పసిడి ప్రియులను భయపెట్టేలా పెరుగుతున్న నేపథ్యంలో ఈ భారీ తగ్గింపు కాస్త ఊరట కలిగించింది. ఇక నేడు పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
నేడు బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 136 రూపాయలు తగ్గి, ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1,00,970 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 125 రూపాయిలు తగ్గి తులం బంగారం ధర రూ. 92,550 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు 18 క్యారట్ల గ్రాము బంగారం ధర 102 రూపాయిలు తగ్గి 10 గ్రాముల ధర రూ.75,730 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది ఇలా ఉండగా మరోవైపు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర రూ. 1,000 తగ్గి రూ.1,28,000 వద్ద ట్రేడ్ అవుతుంది. ప్రాంతాల వారీగా ప్రతిరోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
PM Modi: సెప్టెంబర్‌లో మోడీ అమెరికాలో పర్యటన! యూఎన్ సమ్మిట్‌కు హాజరయ్యే ఛాన్స్
