NTV Telugu Site icon

Gold Rates: పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో రేటెంత?

Gold Rate Today

Gold Rate Today

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గితే.. మరోరోజు పెరుగుతున్నాయి. శనివారం తగ్గుముఖం పట్టిన ధరలు ఆదివారం నాటికి పెరిగాయి. ఆదివారం బులియన్ మార్కెట్‌లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ఒకేసారి రూ.110 పెరిగింది. దీంతో తులం బంగారం ధర సుమారు రూ.51,870కి చేరింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. కేజీ వెండి ధరపై రూ.300 తగ్గడంతో.. ఈ రేటు రూ.65,700గా రికార్డయింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

  1. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 51,870గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,550 వద్ద కొనసాగుతోంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,870గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,550గా నమోదైంది.
  3. విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,870గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,550గా నమోదైంది.
  4. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,760గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,550 వద్ద కొనసాగుతోంది.
  5. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,870గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,550గా నమోదైంది.
  6. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,850గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,600గా ఉంది.
  7. బెంగళూరులో 4 క్యారెట్ల గోల్డ్ ధర రూ.51,870గా, 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,550గా ఉంది.

వెండి ధరలు ఇలా..: హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ మార్కెట్లో కూడా వెండి ధర పడిపోయింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.200 తగ్గి రూ.59,800కు దిగొచ్చింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.300 తగ్గి 65,700గా ఉంది. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, విజయవాడ బులియన్ మార్కెట్లలో కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరగగా.. వెండి ధరలు తగ్గాయి.