Site icon NTV Telugu

Gold Rates: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Gold Price Today

Gold Price Today

గత కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం నాడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. బంగారం దేశంలో పసిడి ధరలు ఈ రోజు కాస్త తగ్గాయి. ఇక వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి. పది గ్రాముల బంగారంపై దాదాపు రూ. 100 తగ్గింది. తాజాగా కిలో వెండిపై రూ. 300 వరకు పెరిగింది. కాగా అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కొవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650గా నమోదైంది. అటు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.66,300గా ఉంది. అటు ఏపీలోని విశాఖ మార్కెట్‌లోనూ ఇవే బంగారం, వెండి ధరలు అమలవుతున్నాయి.

ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.47,650గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.51,980 పలుకుతోంది

చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52, 090పలుకుతోంది.

ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,680గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010పలుకుతోంది.

కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 వద్ద ఉంది.

బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,680గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 పలుకుతోంది.

 కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద ఉంది.

Exit mobile version