జనవరి 21, శుక్రవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం: ఎటువంటి స్వార్థచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. తొందరపడి వాగ్దానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. హోటల్, తినుబండారాల వ్యాపారులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీలకు సంతానంతో, వర్కర్లతో చికాకులు తప్పవు.
వృషభం: ప్రభుత్వ సంస్థలలో పనులు పూర్తి అవుతాయి. రుణంలో కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. రసాయనిక సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభాదయకంగా ఉంటుంది. విద్యార్థులు కళాత్మక, క్రీడాపోటీలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు సత్ఫలితాలనిస్తాయి.
Also Read
మిథునం: రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు స్వీయ ఆర్జనపట్ల ఆసక్తి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కర్కాటకం: మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. మీ కార్యక్రమాలు, ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేసుకోవలసి వస్తుంది. మీ నూతన ఆలోచనలను క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. ఆప్తుల రాకతో గృహం సందడిగా ఉంటుంది.
సింహం: భార్యాభర్తల మధ్య బంధం మరింతగా దృఢంగా మారుతుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. యాదృచ్చికంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, ఏకాగ్రత లోపం వంటి చికాకులు తప్పవు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి.
కన్య: ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. మీరు చేసే పనులకు బంధువులనుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. ప్రముఖ ఆలయాల్లో దైవదర్శనాలు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. స్త్రీలు కళాత్మక పోటీలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు పదోన్నతి, స్థానమార్పిడి యత్నాలలో సఫలీకృతులవుతారు.
తుల: వస్త్ర, వస్తు, బంగారు, వెండి వ్యాపారులకు లాభదాయకం. బంధువులను సహాయం అర్లించటానికి మొహమాటం అడ్డువస్తుంది. ఏదైనా అమ్మకానికై చేయు యత్నంలో పునరాలోచన అవసరం. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. కోర్టు పనులు వాయిదా పడటం మంచిదని గమనించండి.
వృశ్చికం: శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు ఎంతో అవసరం. నిరుద్యోగులు ఏ విషయాన్ని అలక్ష్యం చేయక ఆశాభావంతో శ్రమించిన సత్ఫలితాలు పొందగలరు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. సంతానం లేనివారికి శుభవార్తలందు సూచనలు కలవు.
ధనస్సు: స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఆరోగ్యంలో అధికమైన జాగ్రత్త అవసరం. రాజకీయాలలోని వారికి కార్యకర్తల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. మీ తొందరపాటు నిర్ణయాన్ని మిత్రులలో వ్యతిరేకిస్తారు.
మకరం: మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పలు తప్పవు. కాంట్రాక్టర్లు అతి కష్టంమ్మీద టెండర్లు చేజిక్కించుకుంటారు. మీ కళత్ర వైఖరి చికాకు, నిరుత్సాహం కలిగిస్తుంది. గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. మీ అవసరాలకు కావలసిన ధనం ముందుగానే సర్దుబాటు చేసుకుంటారు.
కుంభం: హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంట్లోనూ, సంఘంలో మీ మాటకు విలువ ఉండదు. విద్యార్థులకు తోటివారు, అధ్యాపకులతో చికాకులు అధికం. కోళ్ల, మత్స్య పాడి రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ఇతరుల సహాయం అర్థించటానికి మొహమ్మాటం అడ్డువస్తుంది.
మీనం: ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రేమికుల అవగాహన రాహిత్యం అనర్ధాలకు దారితీస్తుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. తల పెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం లోపం వల్ల అవకాశాలు జారిపోయే ఆస్కారం ఉంది.
తాజావార్తలు
-
CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
-
US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్‌లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం.. చివరి తేదీని ప్రకటించిన ఎన్టీఏ
-
Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!