Astrology: ఫిబ్రవరి 25, శుక్రవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారు ఉద్యోగరీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. షాపుల స్థల మార్పుతో మరింత అభివృద్ధి సాధ్యం. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదరుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయుట మంచిది.
వృషభం : ఈ రోజు ఈ రాశివారు అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసివస్తాయి. రుణాలు, పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. పట్టుదలతో యత్నాలు సాగించండి, సత్ఫలితాలు లభిస్తాయి. దూర ప్రయాణాల్లో వస్తువులపట్ల మెళుకువ అవసరం. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకావాలి.
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని కంది, మిర్చి, నూనె, వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసివచ్చేకాలం. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ సరదాలు కోరికలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. వృత్తిపరమైన చికాకులు ఎదురవుతాయి. ముఖ్యుల రాకపోకలు అధికం అవుతాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశివారు ఏదైనా అమ్మకానికై చేయు ఆలోచన వాయిదా వేయటం మంచిది. గృహంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలిసిరాగలదు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. బంధువులను కలుసుకుంటారు.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయనాయకులకు దూర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. శత్రువులు మిత్రులుగా మారతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. అనుకోని ఖర్చులు ఎదురైనా ధనానికి ఇబ్బందులుండవు.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. గృహంలో ఏదైనా వస్తువులు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చేతివృత్తుల వారికి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.
తుల : ఈ రోజు ఈ రాశిలోని వ్యాపారులకు పోటీ పెరగటంతో ఆశించింనంత ఆర్థిక సంతృప్తి ఉండదు. ఆడిటర్లకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఇతరుల ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోకండి. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. వాహన యోగం కలదు. హామీలు ఉండుట మంచిది కాదు అని గమనించండి.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు అధికమిస్తాయి. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు. స్థిరచరాస్తుల కొనుగోలు విషయమైన ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. దైవ, సేవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారు గృహోపకరణాలు అమర్చుకుంటారు. స్నేహితులు మీ జీవితాన్నికి మూల స్తంభాలుగా మారతారు. భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ఏకాగ్రత, పెద్దల సలహా పాటించడం క్షేమదాయకంగా ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఎదురయ్యే ప్రతి విషయంలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం : ఈ రోజు ఈ రాశిలోని ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. కరనమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. సోదరులతో ఏకీభవించలేకపోతారు.
కుంభం : ఈ రోజు ఈ రాశివారు ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొడతారు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశతప్పదు.
మీనం : ఈ రోజు ఈ రాశివారికి శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుకుంటారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు.
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!