మే 26 బుధవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం
ఈ రోజు గ్రహాల స్థితి వల్ల శుభప్రభావాలు ఉంటాయి. ఫలితంగా పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. పనిప్రదేశంలో నూతన హక్కులు ఉండవచ్చు. సృజనాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుంది. కొడుకు లేదా కుమార్తే వివాహ విషయంలో ముందుకు సాగవచ్చు. కుటుంబంతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.
Also Read
వృషభం
ఈ రోజు వృషభ రాశి వారు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. అనవసరమైన వస్తువుల కొనుగోలు చేస్తారు. కుటుంబ పెద్దలతో వాదనలు పడకండి. వారి అభిప్రాయాన్ని తీసుకోండి. కార్యాలయంలో ఈ రోజు అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబంలో అన్ని పనుల్లో మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి.
మిథునం
ఈ రోజు మిథున రాశి వారికి ఆహ్లాదకరంగా ఉంటుంది. కార్యాలయంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. గ్రహాల శుభ స్థితి కారణంగా మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాములు, జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఇంట్లో ఆనందం నెలకొంటుంది. రుణాలు చెల్లించడంలో విజయవంతమవుతారు. కుటుంబంలో ఐక్యత ఉంటుంది.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. గ్రహాల స్థితి కారణంగా సంపద వృద్ధి చెందుతుంది. దీర్ఘకాలానికి సరిపడ డబ్బు సంపాదిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆధిపత్యం పెరుగుతుంది. రాజకీయ, సామాజిక రంగాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో రాత్రి సమయంలో సరదాగా గడుపుతారు. స్నేహితుల నుంచి సహాయం పొందుతారు.
సింహం
సింహ రాశి వారికి ఈ రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇతర వ్యక్తులు మీ భావాలు గుర్తిస్తారు. వారితో కలిసి నడిచేందుకు ప్రయత్నించడం వల్ల ఆత్మసంతృప్తి చెందుతారు. కార్యాలయం లేదా దుకాణంలో సమస్యలను ఈ రోజు పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. అనవసర విషయాల్లో తలదూర్చకపోతే మంచిది.
కన్య
ఈ రోజు మీరు వ్యర్థ వ్యయాలు చేస్తారు. మీ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడే మీ పని పూర్తవుతుంది. కార్యాలయంలో అకస్మాత్తుగా మార్పు ఉంటుంది. దాని నుంచి ప్రయోజనం పొందుతారు. మహిళా సహచరులు, పై అధికారులు మీకు మద్దతుగా ఉంటారు. ఫలితంగా మీరు సక్రమంగా పనులు పూర్తి చేయగలుగుతారు. ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండండి.
తుల
తులా రాశి వారికి ఈ రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు ప్రభావంతమైన వ్యక్తిని కలుస్తారు. అకస్మాత్తుగా కొన్ని వైవిధ్యాలు ఉంటాయి. అంతేకాకుండా మీరు ప్రయోజనం పొందుతారు. నూతన పనిని ప్రారంభించ ముందు సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోండి. నూతన పనులు చేయడానికి అవకాశాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి ప్రతి పనిలోనూ ఆనందాన్ని అనుభవిస్తారు. వ్యాపారానికి సంబంధించి నిపుణుల అభిప్రాయాలను తీసుకోండి. మహిళా స్నేహితులతో సమయాన్ని గడుపుతారుు. అన్ని బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృథా ఖర్చులను నియంత్రించండి.
ధనస్సు
ధనస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు ప్రతి పనిలోనూ ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. పాత బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. పనిప్రదేశంలో అనుకూలంగా ఉంటుంది. ఇంటికి అవసరమైన వస్తువుల కోసం షాపింగ్ చేస్తారు. ఖర్చు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. వ్యర్థ వ్యయాలను నియంత్రించండి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకండి. సామాజిక దూరం పాటించండి.
మకరం
ఈ రోజు మకర రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశముంది. సోదరి లేదా సోదరుడు వివాహం గురించి చర్చ కొనసాగవచ్చు. పాత స్నేహితుడు లేదా బంధువు అకస్మాత్తుగా మీ ఇంటికి రావచ్చు. ఫలితంగా మీరు సంతోషంగా ఉంటారు. ఎవ్వరినీ రుణాలు అడగవద్దు, తీసుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు మీరు ఇచ్చిన సొమ్ము తిరిగి రాదు.
కుంభం
ఈ రోజు కుంభ రాశి వారికి ప్రత్యేక విజయాలు ఉంటాయి. రాజకీయ రంగంపై ఆసక్తి కలిగిన వారికి విజయం సొంతమవుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు అందుకుంటారు. మీ కీర్తి పెరుగుతుంది. అవసరమైన విషయాల్లో ఖర్చు చేస్తారు. వీలైనంతవరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.
మీనం
మీన రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఆస్తి పరంగా విజయం సాధిస్తారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో మీ సహచరులు మిమ్మల్ని మోసం చేయవచ్చు. వారితో జాగ్రత్తగా ఉండండి. గురువు పట్ల పూర్తి విధేయతతో మెలగండి. కుటుంబంతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు.
తాజావార్తలు
-
Rukmini Vasanth: బికినీ వీడియోతో షాక్ ఇచ్చిన రుక్మిణి వసంత్.. నెట్టింట హాట్ టాపిక్
-
LIC: ఎల్ఐసీ నుంచి జీవన్ సాథి పేరుతో రెండు కొత్త ప్లాన్లు.. మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారంటీ బెనిఫిట్స్
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!