ఆగస్టు 5, గురువారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతి చేయుయత్నాలు ఫలిస్తాయి ప్రముఖులతో సంప్రదింపులు, చర్చలు జరుపుతారు. మీ బలహీనతలను కొంతమంది స్వార్థానికి వినియోగించుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
వృషభం : సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. నూతన ప్రదేశాల సందర్శనలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. హోటల్, కేటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి.
Also Read
- Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే మూల్యం చెల్లించక తప్పదు!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారం, ఉద్యోగంలో అనుకూలతలు!
- Sunday Horoscope: నేటి రాశిఫలాలు.. ఆ రాశివారు పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాల్సిందే.!
- Astrology: ఆగస్టు 01 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
మిథునం : ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సమస్యలు చక్కబడతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. గత విషయాలు గుర్తుకురాగలవు. ఖర్చులు అంతగా లేకున్నా ధనవయ్యంలో ఏకాగ్రత వహించండి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.
కర్కాటకం : చేపట్టిన ఉపాధి పథకాలు మందకొడిగా సాగుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఏ వ్యక్తినీ అతిగా విశ్వసించడం మంచిదికాదు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక సమస్యను అధికమిస్తారు.
సింహం : చీటికి మాటికి ఎదుటివారిపై అసహనం ప్రదర్శిస్తారు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ధనవ్యయం అధికంగా ఉంటుంది. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది.
కన్య : అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం మంచిదికాదు. ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల మీద మక్కువ పెరుగుతుంది. ఏజెంట్లు, బ్రోకర్లు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.
తుల : పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిదికాదు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరీ, సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
వృశ్చికం : కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థికస్థితి కొంత మెరుగనిపిస్తుంది. అకాల భోజనం, శారీరక శ్రమ వంటి ఇబ్బందులెదర్కొంటారు. మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.
ధనస్సు : వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిగమిస్తారు. ట్రాన్స్పోర్టు, ట్రావెనలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. హోదాలో ఉన్న అధికారులు అపరిచితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం ఉంది.
మకరం : అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. వృథా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆత్మీయులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు.
కుంభం : బంధు మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రతి విషయం మీ జీవితభాగస్వామికి తెలియజేయడం మంచిది. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. నూతన పెట్టుబడుల వ్యవహారంలో ఒక నిర్ణయానికి వస్తారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం.
మీనం : ఎలక్ట్రానిక్ మీడియా వారికి సదావకాశాలు లభిస్తాయి. స్తోమతకు మించిన వాగ్ధానాల వల్ల ఇబ్బందులెదుర్కొంటారు. అనుకున్న పనులు అర్థాంతరంగా ముగిస్తారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వివాహ ఉద్యోగ యత్నాలు నెరవేరగలవు. మీ యత్నాలు ఫలించకపోవడంతో నిరుత్సాహం చెందుతారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!