ఆగస్టు 25, బుధవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణాల కోసం అన్వేషిస్తారు. పత్రికా, వార్తా మీడియా వారికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. విత్తన వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి.
వృషభం : బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల మన్నలు పొందుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. స్త్రీలు పనివారలతో చికాకులు ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది.
Also Read
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
మిథునం : ఆర్థిక ఇబ్బందులు క్రమంగా సర్దుకుంటాయి. వ్యాపారాల అభివృద్ధికి స్థల మార్పు అవసరం. బ్యాంకు పనుల్లో మెళకువ అవసరం. ఓర్పు, విజ్ఞతతో మీ గౌరవం కాపాడుకుంటారు. నిరుద్యోగులు ఆశాదృక్పథంతో యత్నాలు సాగించాలని. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు.
కర్కాటకం : ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, ఒత్తిడి అధికం. పెద్ద మొత్తం ధన సహాయం క్షేమం కాదు. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామిక ఒప్పందాల్లో మీ నిర్ణయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. గుట్టుగా యత్నాలు సాగించండి.
సింహం : వార్తా సంస్థలలోని సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో మీ శ్రీమతి సలహా పాటించడం మంచింది. స్థిరచరాస్తుల విక్రయంలో పునరాలోచన అవసరం. ఖర్చులు అధికం. ధనం పొందుపు చేయాలన్ని మీ సంకల్పం నెరవేరదు. ఇతరుల సహాయం అర్థించడం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు.
కన్య : కుటుంబంలో చిన్న చిన్న చికాకులు తలెత్తినా క్రమంగా సమసిపోగలవు. కొంతమంది మీ సరసపు వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించే ఆస్కారం ఉంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన దంపతుల మధ్య అవగాహన, ప్రేమాభిమానాలు చోటుచేసుకుంటాయి.
తుల : వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. కపటం లేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. బంధువులతో విభేదాలు తొలగి రాకపోకలు అధికమవుతాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. పెద్దలతో ఆస్తి విషయాలు సంప్రదింపులు జరుపుతారు.
వృశ్చికం : కలప, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. చేపట్టి పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీలకు బంధువులు, చుట్టుపక్కల వారితో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. వృత్తి ఉద్యోగస్తులకు గణనీయమైన పురోభివృద్ధి ఉంటుంది.
ధనస్సు : కుటుంబీకుల నిర్లక్ష్యం వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. మెడికల్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రయాణాలు వాయిదావేయడం మంచిది. వాక్ చాతుర్యంనకు అనుకూలంగా ఉండగలదు. ప్రేమ వ్యవహారాలలో విజయం పొందటానికి మరికాస్త కృషి చేయాలి.
మకరం : ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కళా, ఫోటోగ్రఫి ఉన్నత విద్య విదేశీ వ్యవహారాల రంగాల వారికి అనుకూలం సమయం. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రత్తి పొగాకు రంగాలలో వారికి అనుకూలమైన రోజు.
కుంభం : నిత్యావసర వస్తుస్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తినిస్తాయి. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం తగ్గుతుంది. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. గృహమునకు కావలసిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కాని వేళలో బంధుమిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
మీనం : పారిశ్రామిక రంగం వారికి అధికారుల వేధింపులు, కార్మిక సమస్యలు అధికం అవుతాయి. సతీమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. శత్రువులు, మిత్రులుగా మారుతారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!