Zodiac Predictions 2026: మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం స్టార్ట్ కాబోతుంది. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ కొన్ని మంచి, కొన్ని చెడు సంఘటనలు ఎదురు కాబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పలువురు జ్యోతిష్యులు మాట్లాడుతూ.. ఇది గ్రహాలు, నక్షత్రాల కదలిక ద్వారా వస్తుందని అన్నారు. సింహ రాశి వారికి 2026 చాలా కష్టంగా ఉంటుందని అంటున్నారు. ఈ రాశిలో జన్మించిన వారు 2026లో ఆర్థిక, వృత్తి, ఆరోగ్య విషయాలలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలని సూచించారు.
READ ALSO: స్పెషల్ ఆఫర్‌లో 55 అంగుళాల Xiomi FX Pro QLED 4K స్మార్ట్ టీవీ.. ధర ఎంతంటే!
2026లో సింహ రాశి వారు చేసే చిన్న పొరపాటు కూడా పెద్ద సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ రాశి వారికి శని ప్రభావం కొనసాగుతుందని వెల్లడించారు. జనవరి నుంచి డిసెంబర్ ప్రారంభం వరకు కేతువు సింహరాశిలోనే ఉంటాడని, శని – కేతువుల ఈ అరుదైన కలయిక సింహరాశి వారికి అనేక నష్టాలను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. కొత్త ఏడాదిలో సింహ రాశి వారు వృత్తిపరమైన రంగంలో గణనీయమైన నష్టాలను ఎదుర్కోవలసి రావచ్చని అంటున్నారు. మీ ఉద్యోగం ప్రమాదంలో పడవచ్చు, అలాగే కొత్త ఉపాధిని సంపాదించడం కష్టంగా ఉంటుంది. ఇప్పటివరకు బాగానే రన్ అవుతున్న పరిశ్రమలు, దుకాణాలకు ఒక్కసారిగా ఎదురుదెబ్బ తగలవచ్చని అన్నారు. ఈ కొత్త సంవత్సరంలో మీ వ్యాపారం అకస్మాత్తుగా ఆగిపోవచ్చని చెబుతున్నారు.
సింహరాశి వారు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెట్టుబడుల విషయంలో అదృష్టం చాలా తక్కువగా ఉంటుందని, ఆస్తి లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు, శ్రేయోభిలాషుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు. ఈ ఏడాది కాలంలో మీ దగ్గరి బంధువు లేదా స్నేహితుడు మిమ్మల్ని మోసం చేయవచ్చని అన్నారు. ఈ సంవత్సరం అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందడం కష్టంగా మారుతుందని పేర్కొన్నారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎవరైనా క్షణికావేశంలో తుడిచిపెట్టేయవచ్చని హెచ్చరించారు. ఈ నూతన సంవత్సరం సంబంధాల పరంగా ఈ రాశివారికి అంతగా అనుకూలంగా కనిపించడం లేదని అంటున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉందని, గృహ సమస్యలు మానసిక ఒత్తిడికి కారణమవుతాయని అంటున్నారు. తండ్రీకొడుకుల సంబంధం ప్రతికూలంగా మారుతుందని, పూర్వీకుల ఆస్తిలో మీ వాటా తగ్గవచ్చని, ఇది కుటుంబ వివాదానికి దారితీయవచ్చని చెబుతున్నారు. అలాగే మీ పిల్లల పురోగతి, భద్రత గురించి ఆందోళన కలిగించవచ్చని అంటున్నారు.
READ ALSO: India vs South Africa: సంజుతో గంభీర్ మెసేజ్.. బౌలర్‌ను మార్చిన సూర్య! రిజల్ట్ చూశారుగా..