April Horoscope: ఏప్రిల్ నెలలో ఈ 4 రాశుల వారికి కనకవర్షమే.. మీ రాశి ఉందో లేదో చూసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
April Horoscope: కొత్త ఏడాదిలో అప్పుడే మరొక కొత్త నెల ప్రారంభం కాబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏప్రిల్ నెల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా అమితమైన లాభాలను తీసుకురానుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రహగతుల మార్పుల వల్ల వృషభం, సింహం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారు వృత్తి, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలను అందుకుంటారని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ రాశుల వారి జాతకం ఎలా ఉందబోతుందో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
READ ALSO: Weight Loss Drugs: రూ.450తోనే బరువు తగ్గొచ్చు..! వైద్యుల వార్నింగ్..
Also Read
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
- Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
1. వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి ఈ నెల ఆర్థికంగా చాలా బలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రాశి వారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు వస్తాయన్నారు. ఉద్యోగస్థులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ నెల సరైన సమయం అని చెబుతున్నారు. ఈ రాశి వారి కష్టానికి తగిన గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయని అన్నారు. పెరిగిన ఆత్మవిశ్వాసంతో మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారని జ్యోతిష్యులు చెప్పుకొచ్చారు.
2. సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి ఏప్రిల్ నెల ఆదాయ మార్గాలను పెంచుతుందన్నారు. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఈ నెల వారికి ధనం చేకూరుతుందన్నారు. దీంతో వారి బ్యాంక్ బ్యాలెన్స్ వేగంగా పెరుగుతుందని చెప్పారు. వ్యాపారస్తులకు ఈ నెలలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని చెప్పారు. ఖర్చులను అదుపులో ఉంచుకుంటూ ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతారని అన్నారు.
3. వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారు ఈ నెలలో దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని జ్యోతిష్యులు చెప్పారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈ నెలలో వేగంగా పూర్తవుతాయన్నారు. కోర్టు వివాదాలు లేదా ఆర్థిక గొడవలు పరిష్కారమవుతాయని చెప్పారు. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే బలమైన అవకాశాలు ఉన్నాయని, ఈ నెలలో మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక స్థిరత్వం లభిస్తుందన్నారు.
4. ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి కొత్త ప్రయోగాలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం అని అన్నారు. ఉద్యోగంతో పాటు పార్ట్-టైమ్ బిజినెస్ లేదా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది గోల్డెన్ టైమ్‌గా చెప్పారు. ఈ రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయని, కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుందన్నారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉండటం వల్ల గృహిణులకు కూడా ఈ నెల ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. మొత్తం మీద ఈ నాలుగు రాశుల వారికి ఈ ఏప్రిల్ నెల ఆర్థిక పురోగతిని, వృత్తిపరమైన ఎదుగుదలను ఇస్తుందని, ఈ రాశుల వాళ్లు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు సొంతం అవుతాయన్నారు.
READ ALSO: Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?
తాజావార్తలు
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?