Weight Loss Drugs: రూ.450తోనే బరువు తగ్గొచ్చు..! వైద్యుల వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weight Loss Drugs: భారతదేశంలో బరువు తగ్గించే సెమాగ్లుటైడ్ మందు ఇప్పుడు అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. జెనరిక్ వెర్షన్ల విడుదలతో, దీని ధర గతం కంటే ఏకంగా 90 శాతం తగ్గిపోయింది. అయితే, వైద్యుల హెచ్చరిక ప్రకారం, డాక్టర్ సలహా లేకుండా దీన్ని తీసుకోవడం ప్రమాదకరం. మార్చి 20న సెమాగ్లుటైడ్ యొక్క పేటెంట్ గడువు ముగిసిన తర్వాత, నాట్కో ఫార్మా, ఆల్కెమ్ లాబొరేటరీస్ వంటి ప్రముఖ భారతీయ కంపెనీలు జెనరిక్ వెర్షన్‌లను విడుదల చేసింది.. నాట్కో ఫార్మా సెమానాట్, సెమాఫుల్ బ్రాండ్లతో నెలకు రూ.1,290 నుండి ధర ప్రారంభించింది అల్కెమ్ లాబొరేటరీస్ ‘సెమాసైజ్’ మరియు ‘ఒబేసెమా’ పేర్లతో ముందుగా నింపిన పెన్నులు విడుదల చేసింది. వారానికి సుమారు రూ.450 మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది భారతదేశంలో ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే లక్షలాది ప్రజలకు గణనీయమైన ఉపశమనం అని వైద్యులు చెబుతున్నారు.
వైద్యుల హెచ్చరిక
అయితే, వైద్యులు చెబుతున్నది ఏంటంటే..? ఈ మందు అందుబాటులో ఉందని ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవడం సురక్షితం కాదు. తీవ్రమైన ఊబకాయంతో బాధపడేవారికి మాత్రమే, లేదా మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రమే ఇది సరైనదని సూచిస్తున్నారు.. సెమాగ్లుటైడ్ మెదడు, జీర్ణాశయంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇవి, వైద్యుల సలహా లేకుండా వాడడం.. దుర్వినియోగం చేయడం వల్ల ప్యాంక్రియాటైటిస్, మూత్రపిండ సమస్యలు, చివరికి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరించింది..
Also Read
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
నకిలీ మందులపై హెచ్చరిక
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా సెమాగ్లుటైడ్ నకిలీ బ్యాచ్‌లపై హెచ్చరిక జారీ చేసింది. తప్పుడు మోతాదులు, కల్తీ పదార్థాలతో తయారైన నకిలీ మందులు ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంది.. భారతదేశంలో, ఈ మందులను ఎండోక్రినాలజిస్ట్ లేదా రిజిస్టర్డ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే విక్రయించాలి అని CDSCO (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) సపష్టంగా సూచించింది.
జాగ్రత్తే ఒక్కటే మార్గం..
సెమాగ్లుటైడ్ తీసుకునే ముందు వైద్య సలహా తప్పనిసరి. సాధారణ దుష్ప్రభావాలలో వికారం, వాంతులు, విరేచనాలు ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో, ఇది దృష్టి లోపానికి (NAION) కూడా కారణం కావచ్చు. సోషల్ మీడియా సూచనలు, జిమ్ ఇన్‌స్ట్రక్టర్ల సలహా మీద ఆధారపడడం ప్రమాదకరమని హెచ్చరిస్తు్న్నారు.. వైద్యులు స్పష్టం చేస్తున్న సందేశం ఏమిటంటే, సెమాగ్లుటైడ్ ప్రాణాలను కాపాడే మందు కానీ, దీన్ని ఎవరూ ఎప్పుడైనా, ఏ కారణంతోనైనా తీసుకోవాల్సిన జీవనశైలి ఉత్పత్తి కాదు.
తాజావార్తలు
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!