Uttam Kumar Reddy: ఖరీఫ్ కు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ
- కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ
- ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకోవాలన్న మంత్రి
- CMR డెలివరీ గడువును 2026 జనవరి 31 వరకు పొడిగించాలన్న మంత్రి ఉత్తమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఖరీఫ్ 2025–26 సీజన్‌కు సంబంధించిన అంశాలపై వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేఖలో స్పష్టం చేశారు.
రబీ 2024–25 సీజన్‌కు సంబంధించి అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ఉడికిన బియ్యం (పార్బాయిల్డ్ రైస్) కేటాయించాలని కోరారు. అలాగే ఇప్పటికీ 15.57 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం CMR (కస్టమ్ మిల్ల్డ్ రైస్)గా పెండింగ్‌లో ఉన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఖరీఫ్ 2024–25 సీజన్‌కు సంబంధించిన CMR డెలివరీ గడువును 2026 జనవరి 31 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని తెలిపారు.
Also Read
ప్రస్తుతం మిల్లర్ల వద్ద 3.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి నిల్వలు ఉన్నాయని, రైలు రేకుల కొరత కారణంగా మొత్తం 13.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు పేరుకుపోయాయని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితి వల్ల ధాన్యం తరలింపు తీవ్రంగా ప్రభావితమవుతోందని వివరించారు.అలాగే ఖరీఫ్ 2025–26 సీజన్‌కు వరి కొనుగోలు లక్ష్యాన్ని ప్రస్తుతం ఉన్న 36 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులు తక్కువ ధరలకు తమ ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి రాకుండా వారిని రక్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని కూడా లేఖలో స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 65 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమే ఉండగా, అదనంగా మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు మరియు సైలోలు నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఆర్థిక అంశాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని, తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని లేఖలో కోరారు.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!