పార్లమెంట్ లో చేయాల్సిన పనిని శాసన సభలో బీఆర్ఎస్ చేస్తుందన్నారు వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల నిర్వహణ విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకుడు కె.టి.రామారావు (కేటీఆర్) విమర్శించారు..
కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉద్దేశపూర్వకంగా మోసపూరితమైనవి మరియు చట్టబద్ధంగా చెల్లనివి అని, మరియు వారు ఇప్పుడు పాలించడానికి బదులుగా ఈ అంశంపై ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Read Also:Snakes Home: ఎవర్రా మీరంతా.. ఎవరన్నా కుక్కను, పిల్లిని పెంచుకుంటారు. మీరేంట్రా మరీ వాటినా..
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ కోసం బయల్దేరారు. నామినేషన్ వేయడానికి వెళ్లేముందు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి నాయకత్వం లో బిసి లకు న్యాయం జరగదన్నారు కేటీఆర్. 42 శాతం వాటా పొలిటికల్ రిజర్వేషన్ల వరకు మాత్రమే కాదు..కాంట్రాక్టు లలో కూడా బిసి లకు రిజర్వేషన్లు ఇవ్వాలని కొట్లాడాలి. కాంగ్రెస్ చేతిలో ఉన్న రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదన్నారాయన. మోడీ, కాంగ్రెస్ ఇద్దరు కలిస్తే చాయ్ తాగే లోపు రిజర్వేషన్లు అవుతాయి.
జూబ్లీహిల్స్‌లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్య జరిగే ఎన్నిక కాదు.. పదేండ్ల అభివృద్ధి పాలనకు, రెండేండ్ల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. పదేళ్ల రైతుబంధు పాలనకు, రెండు సంవత్సరాల రాక్షస పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారు. ఈమె గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.2500 ఇస్తుందని ఆశిస్తున్నారని అన్నారు.
Read Also:Dharmapuri Arvind : జూబ్లీహిల్స్ ఓట్ల చోరీపై కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, తర్వాత మోసపోయిన యువతీ యువకులు సునీత గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇండ్లు కోల్పోయిన హైడ్రా బాధితులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన మైనార్టీలకు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారని అన్నారు. మరోసారి రాష్ట్రంలో గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల మద్దతుతో, అండతో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఘన విజయం సాధించబోతున్నదని జోస్యం చెప్పారు.