Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు కాబోతోందా? అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానీ… ఆ తర్వాత గానీ… ఆ దిశగా కేంద్రం అడుగులు వేయబోతోందా…? ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మంత్రి చెబుతున్నట్టు… యూపీ నాలుగు రాష్ట్రాలుగా విడిపోవడం తథ్యమా? అసలు ఈ విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలేంటి?
రాజకీయంగా దేశంలోనే అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. సుహెల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్ చేసిన వ్యాఖ్యలు ఈ పాత డిమాండ్‌కు కొత్త ఊపిరి పోశాయి. యూపీని నాలుగు రాష్ట్రాలుగా విభజించడం తథ్యం అని ఆయన తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్ భవిష్యత్తులో పూర్వాంచల్, మధ్యాంచల్, బుందేల్‌ఖండ్, హరిత్ ప్రదేశ్‌లుగా విడిపోవడం ఖాయం అని రాజ్‌భర్ స్పష్టం చేశారు. ఒకవేళ ప్రత్యేక పూర్వాంచల్ రాష్ట్రం ఏర్పడితే, ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి రాజ్‌భర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్వాంచల్ ప్రాంతంలో తమ వర్గానికి బలమైన ఓటు బ్యాంకు ఉందని… భవిష్యత్తులో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నా ఇదే తమ ప్రధాన షరతు అని కూడా తేల్చి చెప్పారు.
ఈ నాలుగు రాష్ట్రాల ప్రతిపాదన ఈనాటిది కాదు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1955లో అంబేద్కర్ తన ‘థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్’ పుస్తకంలో యూపీని మూడు చిన్న రాష్ట్రాలుగా విభజించాలని సూచించారు. 2011 నవంబర్‌లో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా ఆమోదించింది. పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, అవధ్ ప్రదేశ్, పశ్చిమ్ ప్రదేశ్‌లుగా యూపీని విభజించాలని ఆ తీర్మానంలో కోరారు. రాష్ట్రం మరీ పెద్దదిగా ఉండటం వల్ల పరిపాలన కష్టమవుతోందని అప్పట్లో మాయావతి ప్రభుత్వం వాదించింది. 2012లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ తీర్మానం అటకెక్కింది.
Also Read
ప్రతిపాదిత పశ్చిమ్ ప్రదేశ్‌లో దాదాపు 28 జిల్లాలు ఉంటాయి. సహరాన్పూర్, మీరట్, ఆగ్రా, ఘజియాబాద్ లాంటి కీలక ప్రాంతాలు ఇందులో వస్తాయి. ఇక్కడి వ్యవసాయం, చెరుకు ఆధారిత ఆర్థిక వ్యవస్థ.., ఢిల్లీకి దగ్గరగా ఉండటం వంటి కారణాలతో పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని ఎప్పట్నుంచో ఆర్ఎల్డి వ్యవస్థాపకుడు అజిత్ సింగ్ లాంటి నేతలు కోరుతున్నారు. ఇక అవధ్ ప్రదేశ్ విషయానికి వస్తే.., ఇది ఉత్తరప్రదేశ్ మధ్య భాగంలో ఉంటుంది. రాజధాని లక్నో సహా అయోధ్య, రాయ్ బరేలీ, అమేథీ వంటి 17 జిల్లాలు ఈ ప్రతిపాదిత అవధ్ ప్రదేశ్‌లో భాగమవుతాయి.
బుందేల్‌ఖండ్ ప్రాంతం యూపీతో పాటు పొరుగున ఉన్న మధ్యప్రదేశ్‌లో కూడా విస్తరించి ఉంది. యూపీలోని ఝాన్సీ, మహోబా, బాందా సహా ఏడు జిల్లాలు ఈ ప్రతిపాదిత బుందేల్‌ఖండ్ రాష్ట్రంలోకి వస్తాయి. మధ్యప్రదేశ్ సరిహద్దుల వివాదం కారణంగా ఈ రాష్ట్ర ఏర్పాటు కాస్త సంక్లిష్టంగా మారింది. ఇక తూర్పు ఉత్తరప్రదేశ్‌ను కవర్ చేస్తూ పూర్వాంచల్ రాష్ట్ర ప్రతిపాదన ఉంది. అత్యధిక జనాభా, ఆర్థిక అసమానతలు, వలసల సమస్యల కారణంగా వారణాసి, ప్రయాగ్‌రాజ్ లాంటి జిల్లాలతో కూడిన పూర్వాంచల్‌ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న డిమాండ్ బలంగా ఉంది.
పరిపాలనా సౌలభ్యం, ప్రాంతీయ అభివృద్ధే లక్ష్యంగా ఈ చిన్న రాష్ట్రాల డిమాండ్ తెరపైకి వస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇది దేశంలోనే అత్యధికం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే తుది అధికారం పార్లమెంటుకే ఉంటుంది. ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి సిఫార్సు తప్పనిసరి. రాష్ట్రపతి ఈ ప్రతిపాదనను రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపుతారు, కానీ ఆ శాసనసభ ఆమోదం తెలపకపోయినా పార్లమెంట్ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. గతంలో 2000 సంవత్సరంలో కూడా ఉత్తరాఖండ్‌ను యూపీ నుంచే విడదీశారు. యూపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీ నుంచే విభజన మాటలు వినిపిస్తుండటంతో బీజేపీ కూడా ఆ దిశగా అడుగులేస్తుందా అన్న చర్చ మొదలయ్యింది.
తాజావార్తలు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!