Explainer: గల్ఫ్‌లో కొత్త ముసలం మొదలైందా? శత్రువులగా మారిన ప్రాణ స్నేహితులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గల్ఫ్ రాజకీయాల్లో ఒకప్పుడు ప్రాణస్నేహితులుగా ఉన్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య దశాబ్దాల మైత్రికి బీటలు వారుతున్నట్టు కనిపిస్తోంది. ఆగస్టు 7న పవిత్ర మక్కా నగరంలో కుదిరిన సైనిక ఒప్పందం పశ్చిమాసియాలో సరికొత్త యుద్ధ మేఘాలను, దౌత్య విభేదాలను రాజేసింది.
ఒకవైపు అణుశక్తి సంపన్న పాకిస్థాన్, నాటోలో రెండో అతిపెద్ద సైనిక బలగం కలిగిన టర్కీలతో కలిసి.. సౌదీ అరేబియా ‘ఇస్లామిక్ నాటో’గా పిలువబడుతున్న కొత్త కూటమిని తెరపైకి తెచ్చింది. మరోవైపు, ఈ పరిణామం యూఏఈకి ఆగ్రహం తెప్పించగా.. సౌదీ వర్గాలు నేరుగా యూఏఈ-భారత్ రక్షణ బంధాన్ని, ఇజ్రాయెల్ రహస్య సహకారాన్ని వేలెత్తి చూపుతున్నాయి. గల్ఫ్ వేదికగా మొదలైన ఈ రణరంగం వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి? ‘మక్కా ఒప్పందం’ గల్ఫ్ దేశాల ఐక్యతను నిలువునా చీలుస్తోందా?
ఆగస్టు 7న మక్కా నగరంలో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ ఉమ్మడిగా చారిత్రాత్మక ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, అది మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. చమురు సంపన్న సౌదీ అరేబియా, అణ్వాయుధాలున్న పాకిస్థాన్, రక్షణరంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న టర్కీలు చేతులు కలపడమే కాకుండా.. ఈజిప్ట్, ఖతార్, కువైట్, జోర్డాన్, అజర్బైజాన్, సిరియా వంటి దేశాలను కూడా ఈ కూటమిలోకి లాగేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
Also Read
- El Nino: నెమ్మదిగా వేడెక్కుతున్న పసిఫిక్ జలాలు.. ప్రమాదం ముంచుకొస్తోందా?
- Explainer: ఆంధ్రప్రదేశ్‌లో దారుణ పరిస్థితులు..వర్షపు నీరు లేక రైతుల కంట కన్నీరు.. దేశంలోనే టాప్!
- Psychology Facts: 'నాకు ఎవరికీ చెప్పాలని లేదు..' ఈ మాట వెనుక అంతులేని వేదన!
- India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
అయితే ఈ ఒప్పందంపై సంతకాల సిరా ఆరకముందే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 1981లో ఇరాన్-ఇరాక్ యుద్ధం నేపథ్యంలో సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్‌లతో కూడిన 6 దేశాల ‘గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్’ ఏర్పడింది. ఇది ఇప్పటికే ఉమ్మడి రక్షణ వ్యవస్థను, సైనిక కమాండ్‌ను కలిగి ఉంది. అలాంటప్పుడు బయటి శక్తులైన పాకిస్థాన్, టర్కీలతో సౌదీకి ప్రత్యేక రక్షణ కూటమి ఎందుకు అవసరమైందని ఎమిరాటీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ మాజీ సలహాదారు అబ్దుల్ ఖలేక్ అబ్దుల్లా సోషల్ మీడియాలో ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. “గల్ఫ్ ఉమ్మడి ఇంటిని చక్కబెట్టుకోవడం కంటే ఈ కొత్త కూటమి ముఖ్యమా?” అని ప్రశ్నించారు అసలు ఈ కూటమికి శత్రువు ఎవరు? అంటూ 11 ట్వీట్లతో ప్రశ్నల వర్షం కురిపించారు.
యూఏఈ లేవనెత్తిన అభ్యంతరాలపై సౌదీ అరేబియా గట్టిగానే ఎదురుదాడి చేసింది. సౌదీ ప్రిన్స్ అబ్దుల్ రెహమాన్ బిన్ ముసైద్ ఈ అంశంపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సొంత జాతీయ ప్రయోజనాల కోసం ఏ దేశమైనా ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకునే హక్కు ఉంటుందన్నారు. ఇది గల్ఫ్ ఐక్యతకు ఎలా విఘాతం కలిగిస్తుందని ప్రశ్నించారు. ఈ ఒప్పందం ఏ ఒక్క దేశానికీ వ్యతిరేకం కాదని, విదేశీ దురాక్రమణలను తిప్పికొట్టే సమష్టి రక్షణ కవచం మాత్రమేనని రియాద్‌లోని అస్బార్ సెంటర్ అధిపతి స్పష్టం చేశారు.
ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు.. సౌదీ మేధావులు యూఏఈ ద్వంద్వ వైఖరిని నేరుగా ఎండగట్టడం మొదలుపెట్టారు. ఇస్లామిక్ విద్యా సంస్థ మాజీ అధిపతి అబ్దుల్ అజీజ్ అల్-తువైజ్రీ యూఏఈని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2020లో అబ్రహం ఒప్పందాల ద్వారా ఇజ్రాయెల్‌తో చేతులు కలిపినప్పుడు గల్ఫ్ అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల నుంచి రక్షణ కోసం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీని యూఏఈ గడ్డపై మోహరించినప్పుడు గల్ఫ్ దేశాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని నిలదీశారు. అలాగే, భారత్‌తో యూఏఈ కొనసాగిస్తున్న రక్షణ భాగస్వామ్యాన్ని కూడా తెరపైకి తెచ్చారు.
వాస్తవానికి భారత్-యూఏఈల మధ్య పూర్తి స్థాయి ఉమ్మడి రక్షణ ఒప్పందం లేదు. 2003 నుంచి భారత్ – యూఏఈ మధ్య రక్షణ సంబంధాలు వేగంగా విస్తరించాయి. ముఖ్యంగా ఈ ఏడాది జనవరిలో ఇరు దేశాలు సైనిక సాంకేతికత, ఉమ్మడి ఉత్పత్తి, సముద్ర భద్రత, ఉగ్రవాద నిర్మూలన లక్ష్యాలుగా ‘స్ట్రాటజిక్ డిఫెన్స్ పార్టనర్షిప్’ ఫ్రేమ్‌వర్క్‌పై సంతకాలు చేశాయి. ఒకప్పుడు ‘ఐరన్ బ్రదర్స్’గా పిలవబడ్డ సౌదీ-యూఏఈల మధ్య విదేశాంగ విధానంలో వ్యత్యాసాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. యెమెన్ అంతర్యుద్ధంలో సౌదీ అరేబియా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. కానీ యూఏఈ మాత్రం వేర్పాటువాద సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ కి అండగా నిలుస్తోంది. ఇది ఇరుదేశాల ప్రత్యక్ష విభేదాలను బయటపెట్టింది.
మక్కా రక్షణ ఒప్పందం కేవలం మూడు దేశాల సైనిక కలయిక మాత్రమే కాదు.. పశ్చిమాసియాలో సరికొత్త వర్గపోరుకు ఇది నాంది.! ఒకవైపు టర్కీ-పాకిస్థాన్‌ల అండతో కొత్త ఇస్లామిక్ రక్షణ కూటమిని సౌదీ అరేబియా నిర్మించుకుంటోంది. మరోవైపు భారత్, ఇజ్రాయెల్ వంటి అంతర్జాతీయ శక్తులతో యూఏఈ భద్రతా బంధాన్ని పటిష్టం చేసుకుంటోంది. ఈ రెండు గల్ఫ్ అగ్రరాజ్యాల ఆధిపత్య పోరు సంప్రదాయ గల్ఫ్ ఐక్యతను సమాధి చేసేలా కనిపిస్తోంది.
:- CLN RAJU (EDITOR-NTV DIGITAL)
తాజావార్తలు
-
Explainer: గల్ఫ్‌లో కొత్త ముసలం మొదలైందా? శత్రువులగా మారిన ప్రాణ స్నేహితులు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Votes Cancelled: రాజధానిలో 43 లక్షల ఓట్లు గల్లంతు.. మీ ఓటు ఉందా..? లేదా..? తెలుసుకోండిలా..
-
Anaswara : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరోయిన్
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
ట్రెండింగ్
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!