Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కౌంట్‌డౌన్ మొదలయ్యింది… ఫోకస్ మళ్లీ జంతర్ మంతర్ వైపుకు మళ్లింది… పర్మిషన్ లేదంటున్న పోలీసులు… వచ్చి తీరుతామంటున్న సీజేపీ నేతలు… అక్టోబర్ 10న ఢిల్లీలో ఏం జరగబోతోంది…? ఓవైపు విద్యార్థి సంఘాల ఐక్య పోరాట సమితి.. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ.. ఇంకోవైపు కాంగ్రెస్ సహా ఇండీ కూటమి ఆందోళనలు… దేశ రాజధాని స్తంభించబోతోందా? ఢిల్లీ మొత్తం జంతర్ మంతర్ కాబోతోందా? నీట్ ఆందోళనల తరహాలో లక్షలాదిగా ప్రజలు తరలివస్తే పరిస్థితి ఏంటి? ఢిల్లీ రణరంగమేనా?
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా ఏదో ప్రాంతంలో ప్రతి రోజూ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అక్టోబర్ 2న సీజేపీ పిలుపుతో ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు.. ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. సీఈసీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న అన్ని పక్షాలు… ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా అక్టోబర్ 10న భారీ ఆందోళనకు సిద్ధమతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఢిల్లీ బాట పట్టే అవకాశముండటంతో ఢిల్లీలో ఏం జరగబోతోందో అన్న టెన్షన్ అందర్నీ వెంటాడుతోంది.
నీట్ తరహా ఆందోళనలు జరిగే అవకాశాలు ఉండటంతో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ ను పూర్తిగా సీల్ చేశారు. జంతర్ మంతర్ నలుదిక్కులా భారీగా బారికేడ్స్ ను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులతో పాటు ఆర్బీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలను భారీగా రంగంలోకి దించారు. బెంగాల్, చత్తీస్‌గఢ్, జమ్మూకశ్మీర్ నుంచి 12వేల మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఆగమేఘాల మీద ఢిల్లీకి రప్పించారు. ఎన్ని వందల మంది ఢిల్లీకి తరలివచ్చినా… ఒక్కరిని కూడా జంతర్ మంతర్ దరిదాపుల్లోకి వెళ్లకుండా కట్టడి చేసే ఆలోచనలో ఉన్నారు పోలీసులు. ఆ మేరకు యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకుంటున్నారు.
Also Read
జులైలో నీట్ వ్యతిరేక ఆందోళనల కోసం సీజేపీకి జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమాలకు అనుమతిచ్చిన ఢిల్లీ పోలీసులు ఈసారి మాత్రం ముందస్తు వ్యూహంతో తిరస్కరించారు. 2018 సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నా… కనీసం పది రోజుల ముందు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. కానీ సీజేపీ నేతలు కేవలం రెండు రోజుల ముందు మాత్రమే పోలీసులను సంప్రదించారు. దీంతో పర్మిషన్ తిరస్కరించారు. పైగా జంతర్ మంతర్ వద్ద వెయ్యి మందికి మంచి సమావేశమవడానికి అవకాశముండదు. వేలాదిగా ప్రజలు వస్తే… అది చివరకు శాంతి భద్రతల సమస్యగా మారుతుంది. అందుకే పోలీసులు సీజేపీ ఆందోళనలకు అనుమతులు ఇవ్వలేదు.
అయితే పోలీసులు ఎంత పట్టుదలతో ఉన్నారో… సీజేపీ నేతలతో పాటు విద్యార్థి సంఘాలు కూడా అంతే మొండిగా ఉన్నాయి. శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి ఎవరి అనుమతులు అవసరం లేదని… అది తమకు రాజ్యాంగం కల్పించిన హక్కని ఎదురుదాడికి దిగుతున్నారు. ఎవరు అడ్డుకున్నా జంతర్ మంతర్ ను ముట్టడించి తీరుతామని ప్రకటించారు. మరోవైపు ఓట్ చోరీ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండాగా మార్చుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతలు వరుసగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాహుల్, ప్రియాంకల ఆందోళనలతో రెండు రోజులుగా ఢిల్లీ ఉద్రిక్తంగా మారింది.
అక్టోబర్ 10న ఎవరి వ్యూహం ఫలిస్తుందో చూడాలి. పర్మిషన్ నిరాకరించిన ఢిల్లీ పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టులు… గృహనిర్బంధాలతో జంతర్ మంతర్ వరకు రాకుండా అడ్డుకుంటారా… లేక విద్యార్థులు, ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఢిల్లీ మొత్తాన్ని జంతర్ మంతర్ గా మార్చేస్తారో చూడాలి…
తాజావార్తలు
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
-
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!