France: చరిత్ర గొప్ప..దేశం దిబ్బ.. ఫ్రాన్స్ అందుకే తగలబడుతోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాల చరిత్ర మొత్తాన్ని క్రోడీకరించి ఒక్క చోటకు చేర్చినా… దానికి మించిన గొప్ప చరిత్ర ఫ్రాన్స్‌కి ఉందంటారు. అందుకే France is the most civilized country in the world and doesn’t care who knows it అనే మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది. అలాంటి ఫ్రాన్స్ ఎప్పుడూ లేని విధంగా తగలబడుతోంది. దేశం మొత్తం ఉద్యమాల అగ్గి రాజుకుంది. ఓవైపు వీధుల్లో ఆందోళనలు, అల్లర్లతో దేశం అట్టుడుకుతుంటే… మరోవైపు రాజకీయ అస్థిరత, ఆర్థిక మాంద్యం ఫ్రాన్స్ భవిష్యత్తును అంధకారంగా మార్చేస్తున్నాయి. రెండువేల ఏళ్ల చరిత్ర ఉన్న ఫ్రాన్స్‌కు ఇప్పుడెందుకు ఈ దుస్థితి పట్టింది.? సొంత ప్రజలే దేశం మీద ఎందుకు తిరగబడ్డారు.
రాజకీయ తిరుగుబాట్లు, వీధులను దిగ్బంధించి ఆందోళనలకు దిగడం వంటివి ఫ్రాన్స్‌కు కొత్తేమీ కాదు. శతాబ్దాల చరిత్రలో ఫ్రాన్స్ ఈ తరహా ఆందోళలను ఎన్నింటినో చూసింది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల స్థాయి మాత్రం గతానికి మించి కనిపిస్తోంది. ఐదు లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగడం.. అవి హింసాత్మకంగా మారడం.. చిన్న విషయం కాదు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ తో పాటు మార్సెయిల్, బోర్డియక్స్ వంటి ప్రధాన నగరాల్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ఈ అల్లర్ల వల్ల వందల మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగింది. లిమోజెస్ సిటీ హాల్ అగ్నిప్రమాదంలో తీవ్రంగా దెబ్బతింది. దాని గడియారపు టవర్ కూలిపోయింది. పోలీసులు ఎంత మందిని అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నా… అంతకు మూడింతల స్థాయిలో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.
ప్రస్తుత అల్లర్ల కంటే ముందే విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. పాఠశాలల దుస్థితి, ఉపాధ్యాయుల కొరత, ఉద్యోగ అవకాశాలు లేకపోవడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల్లో అప్పట్లోనే 6 వేల మందిని అరెస్టు చేయగా.. వందకు పైగా స్కూళ్లు ధ్వంసమయ్యాయి. రాబోయే రోజుల్లో కార్మిక సంఘాలు కూడా సమ్మెకు దిగాలని యోచిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల నాటికి ఫ్రాన్స్ ప్రజల్లో ఉన్న సామాజిక, రాజకీయ అసంతృప్తి మొత్తం రోడ్లపై నిరసనల రూపంలో బయటపడనుంది.
Also Read
ఫ్రాన్స్‌లో అన్ని వర్గాల ప్రజల్లోనూ అసంతృప్తి తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. విద్యార్థుల మొదలు.. దేశంలో ప్రజలెవరూ సంతృప్తికర జీవితాన్ని గడపడం లేదనిపిస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయి. ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవడం… ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడం… వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినడం.. ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలను కూడా తీర్చకపోవడం… లాంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఫ్రాన్స్ ఆర్థిక పరిస్థితి ఎంతకు దిగజారిందంటే… ప్రభుత్వ అప్పులు జీడీపీలో 119 శాతానికి చేరుకున్నాయి. ఇది యూరోపియన్ యూనియన్ లక్ష్యానికి రెట్టింపు….స్పాట్
ఒకప్పుడు ఫ్రాన్స్ గొప్పతనం గురించి మాజీ అధ్యక్షుడు చార్లెస్ డి గల్లె ఎంతో గర్వంగా చెప్పేవారు. అయితే 1968లో జరిగిన అల్లర్ల తర్వాత ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. ఆనాటి పరిస్థితులే మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఫ్రాన్స్‌ను గట్టెక్కించే నాయకుడిగా ఒకప్పుడు అందరి నోళ్లలో నానిన మాక్రాన్ కు ఇప్పుడు ఆదరణ కరువైంది. ప్రస్తుతం మాక్రాన్ అప్రూవల్ రేటింగ్ కేవలం 15 నుంచి 17 శాతానికి పడిపోయింది. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడమే దీనికి ప్రధాన కారణం.
తాజావార్తలు
-
France: చరిత్ర గొప్ప..దేశం దిబ్బ.. ఫ్రాన్స్ అందుకే తగలబడుతోందా?
-
INDIA Bloc: నేడు ఇండియా కూటమి భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Road Accident: కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి..
-
Trump: రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
India’s Playing XI: కివీస్‌తో తొలి పోరు.. టీమిండియా తుది జట్టులో వైభవ్‌కు ఛాన్స్..?
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!