El Nino: నెమ్మదిగా వేడెక్కుతున్న పసిఫిక్ జలాలు.. ప్రమాదం ముంచుకొస్తోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సముద్రం ఎప్పుడూ తనలో దాచుకున్న రహస్యాలను వెంటనే బయటపెట్టదు. పసిఫిక్ మహాసముద్రం కూడా అలాగే చేస్తుంది. పైకి చూస్తే అంతా నిశ్శబ్దమే.. అలలు ఎప్పటిలాగే వచ్చి వెళ్తున్నాయి. ఆకాశం తన రంగులను మార్చుకుంటూనే ఉంది. కానీ ఆ నీలి నీటి అడుగున మాత్రం ఏదో నెమ్మదిగా మేల్కొంటోంది.
భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ జలాలు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగాయి. అంతేకాదు… ఈ వేడి కేవలం సముద్రం పైపొరలోనే లేదు. నీటి అడుగున మరింత లోతుగా కూడా వేడి నీరు పేరుకుపోతోంది.
సముద్రం తనలో వేడిని దాచుకుంటోంది. ఆ వేడి పెరుగుతున్న కొద్దీ… గాలుల స్వభావం మారుతోంది. గాలులు మారుతున్న కొద్దీ మేఘాల ప్రయాణం మారుతోంది. మేఘాలు మారితే వర్షం మారుతుంది. వర్షం మారితే నేల ఎఫెక్ట్ అవుతుంది. చివరికి ఒక సముద్రంలో మొదలైన చిన్న ఉష్ణోగ్రత మార్పు… వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మనుషుల జీవితాలపై ప్రభావం చూపుతుంది. ఈ మొత్తం మార్పుకు శాస్త్రవేత్తలు పెట్టిన పేరు ఎల్‌నినో. ఇప్పుడు ఈ ఎల్‌నినో సాధారణ స్థాయిలో ఆగిపోతుందా… లేదా గతంలో ప్రపంచ వాతావరణాన్ని తీవ్రంగా కుదిపేసిన స్థాయికి చేరుతుందా అన్నదే అసలు ప్రశ్న.
Also Read
- Explainer: ఆంధ్రప్రదేశ్‌లో దారుణ పరిస్థితులు..వర్షపు నీరు లేక రైతుల కంట కన్నీరు.. దేశంలోనే టాప్!
- Psychology Facts: 'నాకు ఎవరికీ చెప్పాలని లేదు..' ఈ మాట వెనుక అంతులేని వేదన!
- India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
- Independence Day 2026: మౌల్వీ మహమ్మద్ బాఖిర్... బ్రిటిష్ని గడగడలాడించిన జర్నలిస్ట్!
అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్, అంటే NOAA తాజా అంచనాల ప్రకారం… 2026 రెండో భాగంలో ఈ ఎల్‌నినో చాలా బలమైన స్థాయికి చేరే అవకాశం 90శాతానికి పైగానే ఉంది. అంటే వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పుడు చూస్తున్నది కేవలం ఎల్‌నినో కొనసాగుతుందా లేదా అన్నది కాదు. అది ఎంత బలంగా మారబోతోందన్నది. ఇంకో అంచనా మరింత ఆసక్తికరంగా ఉంది. ఈ ఎల్‌నినో 1950 నుంచి ఆధునిక రికార్డుల్లో నమోదైన అత్యంత శక్తివంతమైన ఎల్‌నినోల సరసన నిలిచే అవకాశం 69శాతం వరకు ఉందని అంచనాలు చెబుతున్నాయి.
ఒకవేళ అది నిజమైతే… ఇది చరిత్రలో గుర్తుండిపోయే ఎల్‌నినో కావచ్చు. ఇప్పటికే దాని అడుగుజాడలు కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో వర్షాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఇండోనేషియా లాంటి ప్రాంతాల్లో సాధారణం కంటే పొడి వాతావరణం కనిపిస్తోంది. ఉష్ణమండల ప్రాంతాల్లో గాలుల కదలికలు కూడా మారుతున్నాయి. ఇదే ఎల్‌నినో ప్రత్యేకత.
ఇది ప్రపంచం మొత్తం మీద ఒకే రకమైన వాతావరణాన్ని తీసుకురాదు. ఒక ప్రాంతానికి వర్షాన్ని తీసుకురాగలదు. ఇంకొక ప్రాంతాన్ని ఎండబెట్టగలదు. ఎక్కడో వేడి పెరగొచ్చు. మరెక్కడో వర్షపు పరిస్థితులు మారొచ్చు. అందుకే ఎల్‌నినో బలపడుతోందని తెలిసినంత మాత్రాన ఏ దేశంలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేం. అక్కడి సముద్రాలు, గాలులు, భౌగోళిక పరిస్థితులు కూడా ప్రభావం చూపిస్తాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది.
ఎల్‌నినో బలపడే కొద్దీ ప్రపంచ వాతావరణంలో అస్థిరతకు అవకాశాలు పెరుగుతాయి. ఇది రైతుకు వర్షం రూపంలో కనిపించొచ్చు. ఒక నగరానికి వేడి రూపంలో కనిపించొచ్చు. మరో ప్రాంతానికి పొడిబారిన నేలగా కనిపించొచ్చు. ఇంకో చోట భారీ వర్షంగా కనిపించొచ్చు. అందుకే ఇప్పుడు శాస్త్రవేత్తలు పసిఫిక్ సముద్రాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. సముద్రం ఎంత వేడెక్కుతోంది? ఆ వేడి ఎంత లోతు వరకు వెళ్లింది? గాలుల దిశ ఎలా మారుతోంది? వర్షపు మేఘాలు ఏ ప్రాంతాల వైపు కదులుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే నెలల్లో ఎల్‌నినో అసలు శక్తిని అర్థం చేసుకోవడంలో కీలకం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాలు 2026 చివరి వరకు, 2027 ప్రారంభం వరకు ఈ ఎల్‌నినో కొనసాగి మరింత బలపడే అవకాశాన్ని చూపిస్తున్నాయి. అయితే ప్రకృతి ఎప్పుడూ తన కథను పూర్తిగా ముందే చెప్పదు. అందుకే సెప్టెంబర్‌లో వచ్చే తదుపరి అంచనాలు చాలా కీలకం.
అప్పుడు పసిఫిక్‌లోని ఈ వేడి మరింత పెరిగిందా… తగ్గిందా… లేక ప్రపంచం గతంలో చూసిన అత్యంత శక్తివంతమైన ఎల్నినోలలో ఒకటిగా మారే దారిలోనే ఉందా అన్నది మరింత స్పష్టమవుతుంది. ఇప్పటికి మాత్రం పసిఫిక్ మౌనంగానే కనిపిస్తోంది. అలలు ఎప్పటిలాగే ఒడ్డును తాకుతున్నాయి. కానీ ఆ నీలి నీటి లోపల… సాధారణం కంటే 2 డిగ్రీలకు పైగా పెరిగిన వేడి ఉంది. ఆ వేడి మరింత బలపడితే… దాని కథ పసిఫిక్‌లోనే ముగియదు. ఆకాశంలోకి వెళ్తుంది. మేఘాల్లోకి వెళ్తుంది. వర్షాల్లోకి వస్తుంది. చివరికి… మనం నివసించే నేల మీద తన ముద్ర వేస్తుందండి! ఇది సంగతి!
తాజావార్తలు
-
El Nino: నెమ్మదిగా వేడెక్కుతున్న పసిఫిక్ జలాలు.. ప్రమాదం ముంచుకొస్తోందా?
-
Prabhas : ‘ఫౌజీలో ఈ సీన్ ఎంత బాగా తీశాడంటే’.. హను వర్క్ పట్ల సన్నిహితులతో ప్రభాస్
-
Explainer: ఆంధ్రప్రదేశ్‌లో దారుణ పరిస్థితులు..వర్షపు నీరు లేక రైతుల కంట కన్నీరు.. దేశంలోనే టాప్!
-
Mahesh Babu : ‘డీసీ’ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్.. ఒరిజినల్ అండ్ అవుట్‌స్టాండింగ్
-
AP Assembly Sessions: నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. తొలి రోజు కీలక బిల్లులు, ఎల్‌నినోపై చర్చ!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?