Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యకాంతి ప్రసరించని అథఃపాతాళం… నిరంతరం ఘనీభవించే చలి… ఊపిరాడని పీడనం! ఈ అగాధంలో జీవం మనుగడ సాగించడం సాధ్యమేనా? అంతరిక్షంలో కాకుండా మన భూమి పైనే, అదీ అట్లాంటిక్ మహాసముద్రం కింద ఒక వింత ప్రపంచం దాగి ఉందంటే నమ్ముతారా? అవును, సైన్స్ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన ఆవిష్కరణ ఒకటి వెలుగులోకి వచ్చింది. పగలు, రాత్రి లేని ఆ చీకటి సామ్రాజ్యంలో, సూర్యరశ్మి ప్రమేయం లేకుండానే జీవం ఎలా ఉద్భవించిందో చెప్పే క్లూస్ శాస్త్రవేత్తలకు దొరికాయి. జీవ సృష్టి మూలాలను, భూమి అవతలి గ్రహాలపై ఉండే జీవరాశి అవకాశాలను కదిలించే ఒక అద్భుత పరిశోధన ఇది.
లాస్ట్ సిటీ హైడ్రోథర్మల్ ఫీల్డ్ అంటే ఏంటి?
అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ‘లాస్ట్ సిటీ హైడ్రోథర్మల్ ఫీల్డ్’ ఒక అంతుచిక్కని అద్భుతం. ఇక్కడ సముద్ర గర్భం నుండి పొడవాటి తెల్లటి కార్బోనేట్ చిమినీలు పైకి లేచి ఉంటాయి. ఈ వింత ప్రపంచంపై పరిశోధనల కోసం, ఇంటర్నేషనల్ ఓషన్ డిస్కవరీ ప్రోగ్రామ్-IODP ఆధ్వర్యంలో 2023లో ‘ఎక్స్‌పెడిషన్ 399’ అనే ప్రతిష్టాత్మక మైనింగ్ యాత్రను చేపట్టారు. లాస్ట్ సిటీకి ఉత్తరంగా దాదాపు 800 మీటర్ల దూరంలో ఉన్న ‘అట్లాంటిస్ మాసిఫ్’ అనే నీటి మునిగిన పర్వతంపై శాస్త్రవేత్తలు ఏకంగా 1.3 కిలోమీటర్ల లోతుకు బోర్‌హోల్ వేశారు. భూమి లోపలి పొర అయిన ‘మాంటిల్’ లో ఉండే పెరిడోటైట్, గాబ్రో వంటి బరువైన శిలల గుండా ఈ డ్రిల్లింగ్ సాగింది.
ఈ డ్రిల్లింగ్ పూర్తి కాగానే, వేర్వేరు లోతుల నుండి నీటి నమూనాలను శాస్త్రవేత్తలు పంప్ చేసి సేకరించారు. ముఖ్యంగా సముద్రగర్భం నుండి 675 నుండి 800 మీటర్ల లోతులో లభించిన నీటిలో ఏకంగా 80 శాతం ‘నాచురల్ ఫార్మేషన్ వాటర్’ అంటే భూగర్భ శిలల్లో సహజంగా ఉండే నీరు ఉన్నట్లు గుర్తించారు. ఈ నీటిని రసాయనికంగా పరీక్షించినప్పుడు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అందులో మెగ్నీషియం పూర్తిగా లోపించింది. క్యాల్షియం మాత్రం విపరీతంగా ఉంది. అంతేకాదు… లిథియం, రుబీడియం, సీసియం, స్ట్రోంటియం వంటి మూలకాలు భారీ స్థాయిలో ఉన్నాయి. కనీసం 300 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత వద్ద సముద్రపు నీరు భూగర్భ శిలలతో సుదీర్ఘకాలం జరిపిన రసాయన చర్యల వల్ల మాత్రమే ఇలాంటి సంవిధానం సాధ్యమవుతుంది.
Also Read
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
- Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్‌పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
- Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
హైడ్రోజన్, మీథేన్ వాయువులతో నిండిన వేడి నీరు:
‘జియోకెమిస్ట్రీ, జియోఫిజిక్స్, జియోసిస్టమ్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం… ఈ లోతైన వేడి నీటి రసాయన స్వభావం, లాస్ట్ సిటీ తెల్లటి చిమినీల నుంచి బయటకు వచ్చే ద్రవంతో వంద శాతం సరిపోలింది. అంటే, ఈ చిమినీలకు ఇంధనాన్ని అందిస్తున్న రహస్య హైడ్రోజన్ వనరు భూమి లోపల ఎక్కడో దాగి ఉందనే దానికి ఇదే తిరుగులేని ఆధారం. హైడ్రోజన్, మీథేన్ వాయువులతో నిండిన ఈ వేడి నీరే అక్కడ సూర్యకాంతి లేకపోయినా మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులు బతకడానికి అవసరమైన రసాయన శక్తిని ఇస్తోంది. బిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఎలా పుట్టిందో తెలుసుకోవడానికే కాకుండా… సౌర కుటుంబంలోని బృహస్పతి, శని గ్రహాల మంచు చందమామల అంతర్భాగంలో కూడా ఇలాంటి రసాయన చర్యల వల్లే జీవం ఉండి ఉండవచ్చనే బలమైన విశ్లేషణను ఇది తెరపైకి తెచ్చింది.
అయితే, సైన్స్ ఎప్పుడూ ఒకేసారి తుది తీర్పు ఇవ్వదు. డ్రిల్లింగ్ జరిగిన కొద్ది రోజులకే నమూనాలు సేకరించడం వల్ల అవి కొంతవరకు సాధారణ సముద్రపు నీరు, డ్రిల్లింగ్ ద్రవాలతో మిశ్రమమయ్యాయి. అలాగే ఈ బోర్హోల్కు, లాస్ట్ సిటీ చిమినీలకు మధ్య ప్రత్యక్ష భూగర్భ కనెక్షన్ ఉందనే విషయాన్ని శాస్త్రవేత్తలు ఇంకా అధికారికంగా నిరూపించాల్సి ఉంది. ఏదేమైనా, భూగర్భ శిలలు సముద్రపు నీటితో కలిసి జీవానికి అవసరమైన ఇంధనాన్ని తయారు చేస్తున్నాయనే సత్యం మానవాళి ఆలోచనా పరిధిని దాటి సరికొత్త అంతరిక్ష అన్వేషణలకు దారి చూపుతోంది. ఈ బోర్‌హోల్ స్థిరపడిన తర్వాత జరగబోయే తదుపరి యాత్రలు మరిన్ని నిగూఢ రహస్యాలను బద్దలు కొట్టడం ఖాయం!
: CLN RAJU (EDITOR- NTV DIGITAL)
తాజావార్తలు
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Sakshi Jha: సాక్షి ఝా ‘మ్యాన్ హేటర్’ వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?