Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Top AI Courses in 2026: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్… ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న మాయా ప్రపంచం ఇది! పరిశ్రమలను సమూలంగా మార్చేస్తూ, సరికొత్త కెరీర్ అవకాశాలకు ద్వారాలు తెరుస్తున్న ఈ ఏఐ రేసులో అందరికంటే ముందుండాలనే ఆత్రుత ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా ఈ పోటీ ప్రపంచంలో ముందంజలో ఉండాలంటే ఏఐ కోర్సులు నేర్చుకోవడం ఇప్పుడు అత్యంత అవసరం! హెల్త్‌కేర్ నుంచి ఫైనాన్స్ వరకు ప్రతి రంగంలో ఏఐ నిపుణులకు డిమాండ్ భారీగా పెరగడంతో.. తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి నెటిజన్లు క్యూ కడుతున్నారు. మరి 2026లో టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న ఆ బెస్ట్ ఏఐ కోర్సులు ఏంటి? ఏ కోర్సుతో మీ కెరీర్ రాకెట్లా దూసుకెళ్తుంది? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.. ఏఐ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే బిగినర్స్ నుంచి, అత్యున్నత స్థాయి పరిశోధనలు చేయాలనుకునే ఎక్స్పర్ట్స్ వరకు.. మార్కెట్లో ఇప్పుడు బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయి.
మీరు పూర్తిగా సరికొత్తగా ఈ రంగంలోకి అడుగుపెడుతుంటే, కోర్సెరాలో ఆండ్రూ ఎన్ అందిస్తున్న “AI ఫర్ ఎవ్రీవన్” ఒక అద్భుతమైన ప్రారంభంగా చెప్పవచ్చు. కోడింగ్ లేకపోయినా ఏఐ వ్యాపార ఉపయోగాలు, నైతికతను ఇది సులువుగా నేర్పుతుంది. ఇక టెక్నికల్ అంశాలపై పట్టు కోసం హార్వర్డ్ అందిస్తున్న “ఇంట్రడక్షన్ టు AI విత్ పైథాన్”, ప్రాక్టికల్ పరిజ్ఞానం కోసం ఉడెమీలోని “మెషిన్ లెర్నింగ్ A-Z” కోర్సులు విద్యార్థులను సిద్ధం చేస్తున్నాయి. అయితే, 2026లో ఇండస్ట్రీ-రెడీ నైపుణ్యాల కోసం “PW స్కిల్స్ డేటా సైన్స్ & AI కోర్స్” ఒక పవర్ఫుల్ ఎంపికగా నిలిచింది. ఇది పైథాన్ నుంచి ఏఐ డిప్లాయ్‌మెంట్ వరకు రియల్ టైమ్ ప్రాజెక్టుల ద్వారా ట్రైనింగ్ ఇస్తోంది. అడ్వాన్స్డ్ నాలెడ్జ్ కోసం చూస్తున్న వారికి IBM ప్రొఫెషనల్ సర్టిఫికేట్ లేదా అత్యున్నత స్థాయి MIT సర్టిఫికేషన్లు మార్కెట్లో తిరుగులేని గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి.
Also Read
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
- South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ
- Lizard astrology meaning Vastu lizard symbolism: ఇంట్లో బల్లి ఉంటే శుభ సూచకమా.. ఆ శుభ సూచకమా.. ?
కేవలం షార్ట్ టర్మ్ కోర్సులకే పరిమితం కాకుండా, కంప్యూటర్ సైన్స్ విద్యలోనే సమగ్రమైన మార్పును కోరుకునే వారి కోసం ఒక విప్లవాత్మక వేదిక సిద్ధమైంది. అదే PW IOI అందిస్తున్న BTech CSE ప్రోగ్రామ్. ఇది పాతకాలపు సిలబస్‌ను పక్కన పెట్టి.. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలను ఈ ప్రోగ్రామ్ అందిస్తోంది. కార్పొరేట్ సంస్థలకు అవసరమైన టెక్ స్టాక్స్‌తో బలమైన పోర్ట్‌ఫోలియో బిల్డింగ్, నిపుణుల మెంటార్షిప్, ప్లేస్మెంట్ సపోర్ట్‌తో విద్యార్థులను పూర్తిస్థాయి ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతోంది. మీరు ఏఐ లేదా డేటా సైన్స్ రంగంలో స్థిరపడాలనుకుంటే.. ఇది బెటర్ ఛాయిస్. ఈ కోర్సులకు ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. వీటిలో ఏదైనా ఎంచుకోండి. ఈ కోర్సుల డిమాండ్ నేపథ్యంలో ఉద్యోగం పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
నోట్: కోర్సులు ఎంచుకునే ముందు పూర్తి వివరాలను తెలుసుకోండి. ఈ ఆర్టికల్ కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇస్తున్నాం. తదుపరి జరిగే పరిణామాలకు ntvtelugu.com బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
The India Story : ప్లేట్లోని ఆహారమా? ప్రాణాలు తీసే విషమా?
-
Fatima Sana: చాలా బాధగా ఉంది.. ఇక మమ్మల్ని ఆ అల్లానే కాపాడాలి!
-
Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Naresh Gujral: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల సైబర్ మోసం.. వాట్సాప్ మెసేజ్ తో కొల్లకొగొట్టేసారు.!
ట్రెండింగ్
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!